Site icon HashtagU Telugu

TS : వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!!

Vra

Vra

తెలంగాణలో వీఆర్ఎలకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. గత రెండు నెలలుగా వీఆర్ఏలు చేస్తున్న ఆందోళనలకు ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఇవాళ సీఎస్ సోమేశ్ కుమార్ వీఆర్ఏల సంఘం నేతలతో చర్చలు జరిపారు. వీఆర్ఏల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడంతో చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు వీఆర్ఏలు ప్రకటించారు. రేపటి నుంచి యదాతథంగా విధులకు హాజరు అవుతామని తెలిపారు.