e-Challan : వాహనదారులకు గుడ్ న్యూస్..పెండింగ్ చలాన్ల గడువు పెంపు

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 05:44 PM IST

ఏంటి మీ వాహనం తాలూకా పెండింగ్ చలాన్ (e-Challan) కట్టలేదా..? ఈరోజు తో గడువు పూర్తి అవుతుందని టెన్షన్ పడుతున్నారా..? అయితే టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో వాహనాల పెండింగ్‌ చలాన్లు (Pending Challans) చెల్లింపు గడువును ఫిబ్రవరి 15 వరకు ప్రభుత్వం పొడిగించింది. నేటితో గడువుముగియనున్న నేపథ్యంలో గడువును (Telangana Government has Extended) పెంచుతూ జీవో జారీ చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

దీని ప్రకారం వాహనదారులు గత డిసెంబరులోపు ఉన్న తమ పెండింగ్ చలాన్లను 90 శాతం వరకూ డిస్కౌంట్‌తో చెల్లించవచ్చు. గతేడాది డిసెంబరు 25 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై ముందుగా ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 10 నాటికే పెండింగ్ చలాన్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.113 కోట్లు ఆదాయం సమకూరింది. ద్విచక్రవాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాల చలాన్లపై 60 శాతం ప్రభుత్వం డిస్కౌంట్ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల రికార్డుల ప్రకారం 3.59 కోట్ల పెండింగ్‌ చలానాలు ఉన్నాయి. ఇందులో 80 లక్షల మందికిపైగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను జనవరి 10లోపు చెల్లించారు. పెండింగ్‌లో ఉన్న చలాన్ల గడువు తొలుత డిసెంబరు 25 నుంచి జనవరి 10 వరకూ ఉండగా.. ప్రభుత్వం దాన్ని జనవరి 31 వరకూ పెంచింది. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 15 వరకూ పెంచారు. ఈ-చలాన్‌ వెబ్‌సైట్‌, పేటీఎం ద్వారా చలాన్లు చెల్లించుకోవచ్చు.

Read Also : Budget 2024: రేపే కేంద్ర బడ్జెట్… మధ్యతరగతి ప్రజలకు తీపికుబురు.. ?