తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మూడో రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) సభలో తొలిపద్దు ను ప్రవేశ పెట్టారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్లతో ఓటాన్ అకౌంట్ పద్దును ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో ఏ శాఖకు ఎంత కేటాయిస్తున్నారనేది వివరంగా సభలో భట్టి ప్రస్తావిస్తున్నారు.
సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే స్ఫూర్తితో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు భట్టి తెలిపారు. తెలంగాణ త్యాగమూర్తులు ఏ ఆశయాలతో ఆత్మార్పణ చేశారో వాటిని ఆచరణలోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందరికోసం స్ఫూర్తితో పాలన అందిస్తున్నామని తెలిపారు. పదేళ్ల తర్వాత నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో తెలంగాణ చూస్తోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు నిజమైన ప్రతినిధులుగా ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఉద్ఘాటించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఈ ప్రభుత్వం ఎంతటి సాహసమైనా చేస్తుందని భరోసా ఇచ్చారు. ఇక మూసీ ఆధునీకరణకు వెయ్యి కోట్లు ప్రకటించారు భట్టి.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని 3 జోన్లుగా భావిస్తున్నాం. ORR లోపల ఉన్న ప్రాంతం పట్టణ జోన్ గా, ORR-RRR(రీజినల్ రింగ్ రోడ్డు) మధ్య ప్రాంతం పెరి అర్బన్ జోన్ గా, ప్రతిపాదిత RRR అవతల ప్రాంతాన్ని గ్రామీణ జోన్ గా నిర్ధారించి అభివృద్ధి చేస్తాం అని స్పష్టం చేసారు. అలాగే అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని… ఇందుకోసం మున్సిపల్ శాఖకు రూ. 11,692 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
అలాగే పవిత్ర పుణ్యక్షేత్రాలైన వేములవాడ, భద్రాచలం, బాసర, జమలాపురం (చిన్న తిరుపతి), ధర్మపురిలను అనుసంధానం చేస్తూ టూరిజం సర్క్యూట్గా ఏర్పాటు చేస్తామని భట్టి తెలిపారు. ‘అన్యాక్రాంతమైన దేవాదాయ శాఖకు చెందిన వేల భూములను గుర్తించి వాటిని పరిరక్షిస్తాం అని , గిరిజనుల పండుగైన మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించినట్లు, సులభంగా మొక్కులు చెల్లించేలా పోర్టలు ప్రారంభించినట్లు స్పష్టం చేసారు.
Read Also : Telangana Budget 2024 : రూ. 2,75,891 కోట్లతో తెలంగాణ ఓట్-ఆన్ అకౌంట్ బడ్జెట్