Etala Rajender : బీఆర్ఎస్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం.. ఈట‌లకు వై ప్ల‌స్ భ‌ద్ర‌త.. ఎంత‌మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారంటే..

బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ కు రాష్ట్ర ప్ర‌భుత్వం వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. శ‌నివారం నుంచి ఈట‌ల రాజేంద‌ర్ కు బుల్లెట్ ప్రూఫ్ వెహిక‌ల్‌తో పాటు 16 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
BJP MP Etala Rajender

BJP MP Etala Rajender

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ (Etala Rajender) హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతుంద‌ని, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి (MLC Kaushik Reddy) ఈట‌ల‌ను హ‌త‌మార్చేందుకు కుట్ర చేస్తున్నార‌ని ఇటీవ‌ల‌ ఈట‌ల స‌తీమ‌ణి జ‌మున (Rajender wife Jamuna) ఆరోప‌ణ‌లు చేయ‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో ఈట‌ల భ‌ద్ర‌త‌పై తెలంగాణ ప్ర‌భుత్వం (telangana government) ఫోక‌స్ పెట్టింది. తాజాగా రాష్ట్ర‌ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాజేందర్‌కు వైప్లస్ భద్రత కల్పిస్తూ శుక్ర‌వారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. శ‌నివారం ఉదయం నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే రాజేందర్‌కు వైప్లస్ స్టేట్ కేటగిరి భద్రత ప్ర‌భుత్వం అందించ‌నుంది. ఈ వైప్ల‌స్ భ‌ద్ర‌త‌లో బుల్లెట్ ప్రూఫ్ వెహికల్‌తో పాటు 16మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు.

ఈట‌ల హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతుంద‌ని అత‌ని స‌తీమ‌ని జ‌మున మీడియా ఎదుట ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అంతేకాక‌, హుజురాబాద్ తో పాటు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల్లో అనుమానాస్ప‌ద కార్లు తిరుగుతున్నాయ‌ని ఈట‌ల స్వ‌యంగా వెల్ల‌డించారు. త‌న‌ను చంపేందుకు కుట్ర జ‌రుగుతోంద‌న్నఈట‌ల వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఈట‌ల భ‌ద్ర‌త‌పై మంత్రి కేటీఆర్ ఆరాతీశారు. తెలంగాణ డీజీపీ అంజ‌నీ కుమార్‌కు ఫోన్ చేసి ఎమ్మెల్యే భ‌ద్ర‌త‌పై సీనియ‌ర్ ఐపీఎస్‌తో విచార‌ణ చేయాల‌ని కేటీఆర్‌ సూచించారు. ఈ క్ర‌మంలో ఈట‌ల‌ను క‌లిసి వివ‌రాల‌ను సేక‌రించిన మేడ్చ‌ల్ డీసీపీ సందీప్ రావు ఈట‌ల భ‌ద్ర‌త‌పై సీల్డ్ క‌వ‌ర్ లో డీజీపీకి రిపోర్ట్ అంద‌జేశారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఈట‌ల‌కు వై ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం నుంచి ఈట‌ల‌కు వై ప్ల‌స్ భ‌ద్ర‌త అందుబాటులో రానుంది.

Tamil Nadu Politics: త‌మిళ‌నాడులో మ‌రోసారి ప్ర‌భుత్వం vs గ‌వర్న‌ర్.. అమిత్ షా జోక్యంతో కీల‌క‌ నిర్ణ‌యం ..

  Last Updated: 30 Jun 2023, 09:34 PM IST