Site icon HashtagU Telugu

Telangana – 88 Posts : తొలిసారిగా తెలంగాణ సమాచార శాఖలో 88 జాబ్స్

Rs 1 lakh assistance for minorities-telangana govt

Telangana – 88 Posts : తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సమాచార పౌర సంబంధాల శాఖలో పోస్టుల భర్తీ దిశగా అడుగు పడింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ శాఖలోని 88 పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జీవో నెంబర్ 1384ను విడుదల చేసింది. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయనుంది.

We’re now on WhatsApp. Click to Join

రాష్ట్రంలోని 33 జిల్లాలకుగానూ ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల అధికారి, ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కమిషనరేట్‌లో ఒక పబ్లిసిటీ అసిస్టెంట్ పోస్టును భర్తీ చేయనున్నారు. అర్హులైన వారిని వివిధ స్క్రీనింగ్ పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

Also read : Gill Tests Positive For Dengue: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడికి డెంగ్యూ..? ఆస్ట్రేలియాతో మ్యాచ్ కి డౌటే..!

Exit mobile version