Site icon HashtagU Telugu

TS : రేపు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు..!!

Government Of Telangana Logo

Government Of Telangana Logo

తెలంగాణ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాడు సెలవు దినంగా ప్రకటించింది సర్కార్. భారతదేశంలో హైదరాబాద్ విలీనమైన సందర్భంగా తెలంగాణ సమైక్యతా దినోత్సవం పేరిట శనివారం టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శనివారం సెలవు దినంగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్ ఆదేశాలతో శనివారం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు సీఎస్ ఆదేశాలను అమలు చేయనున్నాయి.