Telangana Government : రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటన

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది

Published By: HashtagU Telugu Desk
telangana government declared holidays to schools

telangana government declared holidays to schools

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ (Telangana Government) కీలక నిర్ణయం తీసుకుంది. రేపు , ఎల్లుండి విద్యాసంస్థలకు (Educational Institutions) సెలవు ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. పలు చోట్ల రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ ఆగిపోయింది.

ఇక స్కూల్స్ , కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల రోడ్లు తెగిపోవడం స్కూల్స్ కు వెళ్లలేకపోతున్నారు. మరో రెండు , మూడు రోజులు ఇలాగే వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలుపడం తో రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. గత గురువారం నుంచి శనివారం వరకు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గడంతో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.

Read Also: Minister : శ్రీనివాస్ గౌడ్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ…

  Last Updated: 25 Jul 2023, 09:42 PM IST