Site icon HashtagU Telugu

January 1 : 2024లో ఫస్ట్ డే.. తెలంగాణలో సెలవు.. ఏపీలో రూ.3వేల పెన్షన్

Telangana Holidays List 202

Telangana Holidays List 202

January 1 : తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న సెలవు ప్రకటించింది. ఆ రోజున జనరల్ హాలిడేగా డిక్లేర్ చేసింది. ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి రెండో శనివారం రోజు ఉండే సెలవును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ 31న రాత్రి 1 గంట వరకు వేడుకలు జరుపుకోవడానికి అనుమతించనున్నారు. ఈనెలలో చివరి రోజున పబ్‌లు, క్లబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లను ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తారు. అయితే దీనికోసం ఆయా షాపుల నిర్వాహకులు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని  పోలీసులు స్పష్టం చేశారు. నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

జనవరి 1(January 1) నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్‌ ప్రారంభమవుతుంది. ఇది ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్‌ను ప్రారంభించేందుకు సొసైటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి నుమాయిష్‌లో దాదాపు 2,400 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రవేశ రుసుమును రూ.40గా నిర్ణయించారు. వృద్ధులు, నడవలేని వారు ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు వారి వాహనాలతోనే నుమాయిష్‌ను సందర్శించే అవకాశం కల్పిస్తారు. ఈ సారి 25 లక్షల మందికిపైగా నుమాయిష్‌ను సందర్శించే ఛాన్స్ ఉంది.

Also Read: AI Vs Job Cuts : ఏఐ ఎటాక్.. పేటీఎంలో వందలాది జాబ్స్ కట్

జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.3,000 వైఎస్ఆర్ పెన్షన్ కానుక  అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఏపీలోని వితంతువులు, ఒంటరి మహిళలు, చేతి వృత్తిదారులకు ప్రతినెలా రూ.2,750 పింఛను అందిస్తున్నారు. దీన్ని జగన్ సర్కారు రూ.3,000కు పెంచింది. పెన్షన్‌ను ఏటా రూ.250 చొప్పున పెంచుతామని వైఎస్ జగన్ గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దాన్నే ఇప్పుడు జగన్  సర్కారు జనవరి 1 నుంచి అమలు చేస్తోంది.