Site icon HashtagU Telugu

Telangana Govt : పాఠశాలలకు పరిశుభ్రతకు నిధులు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana government allocated funds for cleanliness in schools

Telangana government gets relief from high court

Telangana Govt: తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలల పరిశుభ్రత (Schools Cleanliness) కోసం రాష్ట్ర సర్కార్‌కు నిధులు కేటాయించింది. ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ కి స్కూళ్ల పరిశుభ్రత బాధ్యతలను అప్పగించింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా గ్రాంటు మంజూరు చేసిన ప్రభుత్వం.. పాఠశాలల నిధులకు అదనంగా ఈ గ్రాంట్‌ను కేటాయించినట్లు తెలిపింది. పాఠశాలల్లో పరిశుభ్రత కొరవడిన నేపథ్యంలో పారిశుద్ధ్య పనుల కోసం ప్రభుత్వం ఈ గ్రాంట్‌ను మంజూరు చేసింది.ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

దీని ప్రకారం.. 30మంది లోపు విద్యార్థులు ఉన్న పాఠశాలకు రూ.3వేలు గ్రాంటుగా ఇవ్వనుంది. అలాగే, 31 నుంచి 100మంది విద్యార్థులున్న స్కూళ్లకు రూ.6వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.8వేలు, 251 నుంచి 500 లోపు విద్యార్థులుంటే రూ.12వేలు, 501 నుంచి 750 మంది ఉంటే 15వేలు, 750మంది కంటే అధికంగా ఉన్న స్కూళ్లకు రూ.20వేలు చొప్పున గ్రాంటుగా ఇవ్వనుంది. మొత్తం పది నెలల కాలానికి ఒకేసారి నిధులు విడుదల చేయనుంది.

Read Also: Devara : ‘దేవ‌ర’ సెకండ్ సింగల్ రిలీజ్.. ఎన్టీఆర్, జాన్వీ రొమాన్స్ మాములుగా లేదుగా..