Telangana GDP Jump : తలసరి నికర ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ : కేంద్రం

Telangana GDP Jump :  తలసరి నికర ఆదాయం ద్వారా  కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్ లో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 07:59 AM IST

Telangana GDP Jump :  తలసరి నికర ఆదాయం ద్వారా  కేంద్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్న రాష్ట్రాల్లో నంబర్ 1 ప్లేస్ లో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 

రాష్ట్ర తలసరి నికర ఆదాయం విషయంలో గత ఆరేళ్ల వ్యవధిలో తెలంగాణ 72 శాతం వృద్ధిని సాధించిందని తెలిపింది.

రాష్ట్ర తలసరి నికర ఆదాయం అంటే.. రాష్ట్రంలోని  ఒక్కో వ్యక్తి సగటున సంపాదించే ఆదాయం!! 

Also read : New Variant EG.5: కరోనా కొత్త వేరియంట్ మొదటి కేసు ఎప్పుడు నమోదు అయిందంటే..?

దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ తలసరి నికర ఆదాయం వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ రాజ్యసభకు తెలియజేశారు. అయితే ఆ రాష్ట్రానికి కేంద్రం కూడా అదే స్థాయిలో పన్ను ఆదాయాలను కేటాయించిందని ఆయన వివరించారు. గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర తలసరి దేశీయ ఉత్పత్తి ఎంత అని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు  సమాధానమిస్తూ.. ఈవివరాలను పంకజ్ చౌదరీ వెల్లడించారు. తెలంగాణ తలసరి నికర ఆదాయం 2017-18లో రూ.1.79 లక్షలు , 2018-19లో రూ.2.09 లక్షలు,  2019-20లో రూ. 2.31 లక్షలు, 2020-21లో రూ. 2.25 లక్షలు,  2021-22లో రూ. 2.65 లక్షలు, 2022-23లో రూ. 3.08 లక్షలుగా ఉందని తెలిపారు. ఈ విభాగంలో తెలంగాణ(Telangana GDP Jump) తర్వాతి స్థానాల్లో కర్ణాటక, హర్యానా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర తలసరి నికర ఆదాయం రూ.3 లక్షలు,  హర్యానా రాష్ట్ర తలసరి నికర ఆదాయం  రూ. 2. 96 లక్షలుగా ఉంది.  కాగా, “కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రాష్ట్రాల వారీగా వచ్చే ఆదాయ సమాచారాన్ని కేంద్రం నిర్వహించదు” అని మంత్రి పంకజ్ చౌదరీ స్పష్టం చేశారు.

Also read : 1700 Buildings Destroyed : ఆ టౌన్ 80 శాతం కాలి బూడిదైంది.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు