హైదరాబాద్ లో తొలి గే వివాహం

తమ కులం కానివారిని ప్రేమించిందనే కారణంతో ప్రేమికులను నరికేస్తున్న తెలంగాణ గడ్డపైనే ఒక ప్రేమ జంట రికార్డు సృష్టించనుంది.

  • Written By:
  • Updated On - November 1, 2021 / 11:09 AM IST

తమ కులం కానివారిని ప్రేమించిందనే కారణంతో ప్రేమికులను నరికేస్తున్న తెలంగాణ గడ్డపైనే ఒక ప్రేమ జంట రికార్డు సృష్టించనుంది.

ప్రేమకి, పెళ్ళికి కులం, ప్రాంతం, ఆస్థి, అంతస్థే కాదు జెండర్ కూడా అడ్డుకాదని తరతరాల నుండి వస్తోన్న సంప్రదాయాలను ఇద్దరు గే లు బద్దలు కొట్టి జంటగా మారనున్నారు.

హైదరాబాద్ లోని ఒక హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్లో లెక్చరర్‌‌గా పనిచేస్తున్న సుప్రియో, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అభయ్‌‌ కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. వీరికి 8 సంవత్సరాల కింద ఓ డేటింగ్‌ యాప్‌లో పరిచయమైంది. అది కాస్తా స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారింది. దీంతో ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు కొంతకాలం సహజీవనం చేశారు. ఒకరికొకరు మరింత దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణలో ఇద్దరు స్వలింగ సంపర్కులకు జరిగే మొదటి వివాహం వీళ్లదే.

పెళ్లి గురించి తల్లిదండ్రులను ఒప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని, దేవుడి దయతో చివరికి వారు ఒప్పుకున్నట్లు సుప్రియో, అభయ్‌ తెలిపారు.

సంప్రదాయబద్ధంగా బహిరంగంగానే పెళ్లి చేసుకోనున్నట్టు ఆ జంట తెలిపింది. 2014లో స్వలింగ సంపర్కులతో నిర్వహించిన హైదరాబాద్‌ ప్రైడ్‌ వాక్‌ తన జీవితాన్నే మార్చిందని సుప్రియో అన్నాడు. సాధారణ వివాహ వేడుకల మాదిరిగా హల్దీ వేడుక‌తో పాటు రింగులు మార్చుకోవడం లాంటి పద్ధతులన్నీ వాళ్ళ పెళ్ళిలో ఉంటాయట.

ప్రేమకి, పెళ్ళికి ఏదీ అడ్డు కాదని నిరూపిస్తున్న ఈ జంటకి హ్యాట్సాఫ్, ఆల్ ది బెస్ట్.