Site icon HashtagU Telugu

Bandi Sanjay: తెలంగాణ నిధులు పక్క రాష్ట్రానికి మల్లింపు: బండి సంజయ్

Bandi letter to cm kcr

Kcr Bandi

Bandi Sanjay: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న సామెత ప్రస్తుతం తెలంగాణ హక్కుగా మారిపోయింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం బీడ్ దాఖలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సందర్శించి అధ్యాయనం చేయాల్సిందిగా అధికారులని ఆదేశించారు.

ఈ మేరకు ఆ కర్మాగారానికి నిధులు ఇచ్చి ఉత్పత్తులను వెనక్కి తీసుకునేందుకు కెసిఆర్ ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ఒక్కసారిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశం రాజకీయంగా హీట్ ని పెంచింది. ఆంధ్రాలో తెలంగాణ పెత్తనం ఏంటని కొందరు ప్రశ్నిస్తుంటే.. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు తెలంగాణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్.

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు బండి. కన్నతల్లికి అన్నం పెట్టలేనోడు పినతల్లికి బంగారు కడియాలు చేయిస్తానన్నట్టుగా కేసీఆర్ వ్యవహార శైలి ఉందని మండిపడ్డారు. తెలంగాణ సొమ్ముని ఆంధ్రాలో ఎలా పెడతావు అంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నిరవేర్చకుండా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాడని విమర్శించారు బండి సంజయ్.

రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇలా ఇచ్చిన హామీల సంగతి పక్కనపెట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిశ్రమలపై దృష్టి పెడుతున్న ముఖ్యమంత్రి. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చు అంటూ డిమాండ్ చేశారాయన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చి ప్రజల్ని మోసం చేశావు. ఆ ఫ్యాక్టరీ తెరుచుకుంటే తెలంగాణాలో 20 వేల మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రజల్ని మోసం చేశావు. ఆ మాట చెప్పి ఏళ్లు గడుస్తున్నాయని, దమ్ముంటే ఇప్పుడు ఫ్యాక్టరీ పెట్టు అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. కేసీఆర్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్‌ఎస్ తెలంగాణ ఆదర్శాలను పక్కన పెట్టిందని బండి సంజయ్ ఆరోపించారు

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తెలంగాణ బీడ్ దాఖలుపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. ఇదే మా స్టాండ్. అయితే తెలంగాణ ప్రభుత్వం బీడ్ వేస్తున్నట్లు అధికారికంగా సమాచారం లేదన్నారు మంత్రి. మరోవైపు స్టీల్ ప్లాంట్ ని దక్కించుకునేందుకు కెసిఆర్ ప్రయత్నం చేస్తుండగా.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు సిద్ధమవుతుండగా సీఎం జగన్ మాత్రం స్పందించడం లేదని విపక్షాలు చురకలంటిస్తున్నాయి.