ఇప్పుడు యావత్ తెలంగాణ ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. పదేళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని కాంగ్రెస్ భావించింది కానీ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి తలనొప్పిలే గాని మంచి అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఫ్రీ బస్సు అని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఫ్రీ అంటే ఎప్పుడోసారి మహిళలు ప్రయాణాలు చేస్తారని అంత అనుకున్నారు..కానీ ఇప్పుడు ఫ్రీ అని చెప్పి మహిళలంతా ప్రతి రోజు పెద్ద ఎత్తున బస్సు ప్రయాణాలు చేస్తూ వస్తున్నారు. దీనిద్వారా ఆర్టీసీకి నష్టమే తప్ప లాభం లేకుండా పోయింది. కేవలం ఆర్టీసీకి మాత్రమే కాదు ఆటోలకు, క్యాబ్స్ మిగతా ప్రైవేట్ వాహనాలకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. మొన్నటి వరకు ఆటో డ్రైవర్లు రోజుకు 1000 రూపాయలు సంపాదించుకునేవారు కానీ ఈ ఫ్రీబస్ పథకం పెట్టిన దగ్గరి నుండి రోజుకు రూ.200 రావడం కూడా గగనమై పోయింది. ఫ్రీ అని చెప్పి మహిళలు కనీసం ఆటోలు ఎక్కడమే మానేశారు. కాసేపు వెయిట్ చేసి ఫ్రీ బస్సు ఎక్కుదామని భావిస్తుండటం వల్ల ఆటోల గిరాకి పూర్తిగా తగ్గిపోయింది. ఫ్యామిలీ తో ఉన్నవారు సైతం బస్సు ఎక్కేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. మా బ్రతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేసిందని ఆటో డ్రైవెర్లంతా గగ్గోలు పెడుతూ.. గత కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు, ధర్నాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వస్తున్నారు. ఈరోజు ఏకంగా బిక్షాటన చేయడం మొదలుపెట్టారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ పథకం ఫై మగవారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ లేనప్పుడు ఏదైనా ఫంక్షన్ కో..లేదా అత్యవసరమైతే తప్ప ఆడవారు బయటకు వచ్చేవారు కానీ..ఇప్పుడు ఫ్రీ అని చీటికీ మాటికీ సిటీకి వెళ్తుండడం..బంధువుల ఇళ్లకు వెళ్లడం చేస్తున్నారని వారంతా వాపోతున్నారు. మరోపక్క బస్టాండ్ లలో కనీసం బస్సులు ఎక్కలేకపోతున్నామని..కనీసం మగవారికి సీట్లు లేకుండా అయిపోతుందని..డబ్బులు పెట్టి గంటల కొద్దీ నిల్చుని ప్రయాణం చేయాల్సి వస్తుందని వారంతా వాపోతూ..మగవారికి ప్రత్యేక సీట్లు కేటాయించడం..లేదంటే ప్రత్యేక బస్సులు కేటాయించడం చేయాలనీ కోరుతున్నారు. ఇదే సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం లేనప్పుడే బాగుండేదని , డబ్బులు పెట్టైనా సుఖంగా వెళ్లేవాళ్లమని..ఈ పథకం పెట్టడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నామని వారంతా వాపోతున్నారు. ఫ్రీ పథకం పెట్టే బదులు ఆఫ్ చార్జీ చేస్తామని చెప్తే బాగుండు అప్పుడు ప్రభుత్వానికి నష్టం వాటిల్లేది కాదని..ఇంత జనాలు ఎక్కేవారు కూడా కాదని..ఏదైనా ఫ్రీ పథకం పెట్టకుండా ఉండాల్సిందని చెపుతున్నారు.
ఇప్పుడే ఇలా ఉంటే మరో నాలుగు రోజుల్లో సంక్రాంతి మొదలు కాబోతుంది ఆ సమయంలో ఇంకెలా ఉంటుందో అని భయపడుతున్నారు. మామూలు రోజుల్లోనే బస్సుల్లో కిక్కిరిసిపోతుంటే పండుగ సమయంలో టాప్ పైన కూర్చొని వెళ్తారు కావచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
Read Also : Ambati Rayudu : రాయుడు ముందే వైసీపీ ఓటమిని గ్రహించాడా..? అందుకే రాజీనామా చేశాడా..?