Telangana Formation Day 2024: అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు

Telangana Formation Day 2024: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆందులూ భాగంగా రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.

వేడుకలకు సన్నాహకంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాబృందాలు ప్రత్యేక ప్రదర్శనలతో ట్యాంక్‌బండ్ వద్ద సాయంత్రం ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తమ పౌరులందరికీ చిరస్మరణీయమైన సంఘటనగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

ఆదివారం జరగనున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ హాజరుకావడం లేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో తాను, తన బీఆర్‌ఎస్ పార్టీ పాల్గొనబోమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన బహిరంగ లేఖలో తెలిపారు.తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించే కాంగ్రెస్ పోకడలను నిరసిస్తున్నాం. సుదీర్ఘ ప్రజాపోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితమే రాష్ట్ర ఏర్పాటు. పార్టీ దయతో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ భావాల దారిద్య్రానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నాను’ అని ఆయన ఆరోపించారు.

Also Read: BRS Win : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో  బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం