Site icon HashtagU Telugu

Telangana Formation Day : ట్యాంక్ బండ్ పై అంబరాన్ని తాకిన దశాబ్ది ఉత్సవాలు

Telangana Formation Day 202

Telangana Formation Day 202

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తయిన వేళ రాష్ట్ర అవతరణ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. ఆదివారం రాత్రి నగరంలోని ట్యాంక్ బండ్ పై నిర్వహించిన సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్ తోపాటు పలువురు ప్రముఖులు, అధికారులు ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసినటువంటి వివిధ స్టాళ్లను పరిశీలించారు. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్ర, వైభవాన్ని చాటేలా కళాకారులు కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి 5వేల మంది ట్రైనీ పోలీసులతో ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. ఈ ఫ్లాగ్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ షో, బాణసంచా వెలుగుల్లో ట్యాంక్ బండ్ ప్రాంతం మెరిసిపోయింది. వేడుకల సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. వర్షంలోనూ ఘట విన్యాసం, ఒగ్గుడోలు, బోనాల కోలాటం, గుస్సాడీ, బతుకమ్మ తదితర కళారూపాల ప్రదర్శన ఆద్యంతం కన్నుల పండువగా సాగింది.

We’re now on WhatsApp. Click to Join.

అనంతరం వేదికపై తెలంగాణకు నృత్య నీరాజనం పేరుతో సంప్రదాయ, పేరిణి భేరిణి శివతాండవం తదితర నృత్య రూపాలు అందరినీ ఎంతగానో ఆకర్షించాయి. కళారూపాల ప్రదర్శన అనంతరం పూర్తి నిడివి కలిగిన “జయ జయహే తెలంగాణ” రాష్ట్ర గీతాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం గీత రచయిత అందె శ్రీ, స్వరకర్త కీరవాణిని సీఎం సన్మానించారు. అనంతరం వాన జోరు పెరగటంతో అనుకున్న సమయాని కంటే ముందుగానే కార్యక్రమాన్ని ముగించాల్సి వచ్చింది.

Read Also : Hyderabad Rains : హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం..!