తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని (Telangana Formation Day) ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించి, అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్(Secunderabad Parade Grounds)లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, రాష్ట్ర గీతాన్ని ఆలపించనున్నారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో పరేడ్‌ను పరిశీలిస్తారు. పోలీస్ బలగాలు, గురుకుల విద్యార్థుల నుంచి మార్చ్ ఫాస్ట్ ప్రదర్శనలు ఉంటాయి. సీఎం ప్రసంగం అనంతరం పోలీస్ సిబ్బందికి మెడల్స్ బహూకరించి, బహుమతులు అందజేస్తారు. కార్యక్రమం ముగింపు భాగంగా గ్రూప్ ఫోటో తీసుకుంటారు.
Punjab Kings: అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. ఫైనల్‌కు చేరిన పంజాబ్స్!
ఈ సందర్భంగా జపాన్‌లోని కితాక్యూషూ నగర మేయర్ కజుహిసా టకేచీ పరేడ్ గ్రౌండ్స్ వేడుకల్లో అతిథిగా పాల్గొంటారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కితాక్యూషూ సిటీ మధ్య పరస్పర సహకార ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో భాగంగా కితాక్యూషూ సిటీకి వెళ్లి ఆహ్వానం అందించిన నేపథ్యంలో మేయర్ ఈ వేడుకలో పాల్గొననున్నారు. కాలుష్యంతో కుబుసమైన నగరంగా గుర్తింపు పొందిన కితాక్యూషూ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణలో ప్రపంచానికి ఆదర్శంగా మారింది. ఇలాంటి అనుభవాన్ని తెలంగాణకు తీసుకొచ్చేందుకు రెండు నగరాలు కలిసి పని చేయనున్నాయి.
YCP Criminal Ideology: వైసీపీ నేరపూరిత, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్న ఘటనలు ఇవే!
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ అవతరణ ఉత్సవాలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్‌లు ఆయా జిల్లాల్లో జరిగే వేడుకల్లో పాల్గొననున్నారు. కలెక్టరేట్‌ల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ప్రజల పోరాటంతో సాకారమైనదని, వారి ఆశల ఆకాంక్షలను నెరవేర్చేందుకు “తెలంగాణ రైజింగ్” నినాదంతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిపేలా భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.