Telangana Govt Jobs:నిరుద్యోగులకు శుభవార్త..10వేల పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్..!!

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. కొత్తగా మరో పదివేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

  • Written By:
  • Updated On - June 18, 2022 / 09:40 AM IST

తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర సర్కార్. కొత్తగా మరో పదివేల ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గురుకులాల్లోనే 9వేల పోస్టులు ఉన్నాయి. బీసీ గురుకులాల్లో 3,870, గిరిజన గురుకులాల్లో 1514 ఎస్సీ గురుకులాల్లో 2267పోస్టులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులన్నింటినీ గురుకుల విద్యాలయాల నియామక బోర్డు ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇక ఎస్సీ అభివృద్ధిశాఖలో 316, మహిళా శిశుసంక్షేమశాఖలో 251, బీసీ సంక్షేమశాఖలో 157, గిరిజన సంక్షేమశాఖలో 78, దివ్యాంగశాఖలో 71, జువైనల్‌ వెల్ఫేర్‌లో 66 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇతర 995 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా… మహిళా శిశు సంక్షేమశాఖలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా మరో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 45,325 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చినట్లయ్యింది. ఈ ఉద్యోగాల భర్తీ అంశాన్ని ట్విటర్‌ ద్వారా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇప్పటికే 45,325 ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చినట్లు వెల్లడించారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్నారు హరీశ్ రావు. కాగా ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన తర్వాత…ఇప్పటికే వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు నోటిపికేషన్లు జారీచేసిన విషయం తెలిసిందే.