CM Revanth Reddy : తెలంగాణ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ ఆసక్తికర ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు. సోమవారం ఢిల్లీలో సీఎం అధికారిక నివాసంలో జరిగిన ఈ భేటీలో, తెలంగాణలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన సినిమా స్టూడియో నిర్మాణం కోసం అవసరమైన సహకారం కల్పించాలని అజయ్ దేవగణ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
ఈ స్టూడియోలో యానిమేషన్, వీఎఫ్ఎక్స్, ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లాంటి ఆధునిక టెక్నాలజీ విభాగాలను ఏర్పాటు చేయాలన్నది అజయ్ దేవగణ్ ప్రణాళిక. అయితే.. అంతేకాదు, ఈ రంగాల్లో పనిచేసే నిపుణులను తయారుచేయడానికిగాను ఒక ప్రత్యేక నైపుణ్య శిక్షణ సంస్థను కూడా స్థాపించేందుకు ఆయన సన్నద్ధతను వ్యక్తం చేశారు.
Hanako Koi Fish : చేపలు కూడా శతాబ్దాల జీవులు కావచ్చా? ‘హనకో’ కథ తో ఆలోచన మారుతోంది ..!
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సినీ పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, టెక్నాలజీతో ముందుకు సాగే అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికల్లో మీడియా, ఫిల్మ్ రంగాలకు ముఖ్యమైన స్థానం కల్పిస్తున్నట్లు వివరించారు.
అజయ్ దేవగణ్ మాట్లాడుతూ, “తెలంగాణ రైజింగ్”లో భాగంగా రాష్ట్రాన్ని దేశం దృష్టికి తీసుకురావడంలో మీడియా, సినిమాలు కీలకపాత్ర పోషిస్తాయని, ఈ ప్రయాణానికి తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధమని చెప్పారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, కేంద్ర పథకాల సమన్వయ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో నిర్మాణం అనేది మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Telangana Cabinet : 10న తెలంగాణ క్యాబినెట్ భేటీ..ఆ అంశాలపైనే చర్చ !