Padma Rao Goud: తెలంగాణ మాజీ డిప్యూటీ స్పీకర్ , సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురైయ్యారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు గుండెపోటు రావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పద్మారావు గౌడ్‌కు గుండెపోటు వచ్చిన వార్త బీఆర్ఎస్ కార్యకర్తలు , అభిమానుల్లో ఆందోళనకు గురి చేసింది.
APPSC : గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
వ్యక్తిగత , రాజకీయ జీవితం
పద్మారావు గౌడ్ తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో బలమైన రాజకీయ నేతగా గుర్తింపు పొందారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్‌గా తన రాజకీయ జీవన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆయన ఒక్కో మెట్టుగా ఎదిగారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన ఆయన, 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
2009లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, 2014లో మళ్లీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014-2018 మధ్య ఎక్సైజ్ , స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఫిబ్రవరిలో తెలంగాణ రెండో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నియమించబడ్డారు. 70 ఏళ్ల వయసులో కూడా పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ పార్టీకి శక్తివంతమైన నేతగా కొనసాగుతున్నారు.
CM Revanth Davos Tour : తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు యూనిలీవర్ గ్రీన్ సిగ్నల్