Site icon HashtagU Telugu

Entrance Test Dates : తెలంగాణలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు..

Telangana entrance exam dates are finalised..

Telangana entrance exam dates are finalised..

Entrance Test Dates : తెలంగాణలో నిర్వహించనున్న వివిధ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. 2025-26 విద్యాసంవ‌త్స‌రానికి సంబంధించి ఆయా కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష‌ల తేదీల‌ను ఖ‌రారు చేసింది. అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీ కోర్సులకు సంబంధించి ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజినీరింగ్ కోర్సుల‌కు మే 2 నుంచి 5వ తేదీ వ‌ర‌కు కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించ‌నున్నారు.

బీఈ, బీటెక్, బీ ఫార్మ‌సీ, ఫార్మ్ డీ వంటి కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే టీజీ ఎప్‌సెట్ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్, మే నెల‌లో నిర్వ‌హించ‌నున్నారు. టీజీ ఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ను మే 12, టీజీ ఎడ్‌సెట్‌ను జూన్ 1, టీజీ లాసెట్, ఎల్ఎల్ఎం కోర్సుల‌కు జూన్ 6, ఐసెట్ ప‌రీక్ష‌ల‌ను జూన్ 8, 9 తేదీల్లో, టీజీ పీజీఈసెట్ ప‌రీక్ష‌ల‌ను జూన్ 16 నుంచి 19 వ‌ర‌కు, టీజీ పీఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను జూన్ 11 నుంచి 14 వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.

Read Also: Meta Apology : భారత ఎన్నికలపై జుకర్‌బర్గ్ కామెంట్స్ తప్పే.. సర్కారుకు మెటా కంపెనీ సారీ