Telangana Election : అక్టోబ‌ర్ లేదంటే మార్చి..కేసీఆర్ కు ప‌రీక్ష‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు(Telangana Election) ఎప్పుడు జ‌రుగుతాయి?కేసీఆర్ చెప్పిన‌ట్టు మ‌రో నాలుగు నెలల్లో ఎన్నిక‌ల‌కు ఉంటాయా?

  • Written By:
  • Updated On - April 28, 2023 / 04:20 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు(Telangana Election) ఎప్పుడు జ‌రుగుతాయి? ప్ర‌తినిధుల సభ‌లో కేసీఆర్ (KCR)చెప్పిన‌ట్టు మ‌రో నాలుగు నెలల్లో ఎన్నిక‌ల‌కు ఉంటాయా? కేసీఆర్ ఢిల్లీ త్వ‌ర‌లో అందుకే వెళుతున్నారా? ఇలాంటి ప్ర‌శ్న‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో సీరియ‌స్ వినిపిస్తున్నాయి. ఆయ‌న ఇచ్చిన సంకేతాల ప్ర‌కారం అక్టోబ‌ర్ నెల‌లో ఎన్నిక‌ల‌ జ‌రగాలి. కానీ, అధికారంలోకి రావాల‌ని భావిస్తోన్న బీజేపీ మాత్రం మ‌రో ఎత్తుగ‌డ‌తో ఉంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ ఎన్నిక‌లు పెట్టేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు(Telangana Election)

తెలంగాణ అసెంబ్లీ (Telangana Election) గడువు ఈ ఏడాది డిసెంబ‌ర్ తో ముగిస్తుంది. ఆ లోపు ఎన్నిక‌ల‌కు నిర్వ‌హించాలి. అందుకోసం ఇటీవ‌ల ఎన్నిక‌ల క‌మిష‌న్ అధికారులు కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్య‌టించారు. గడువులోగా ఎన్నిక‌లు జ‌ర‌పాలంటే, తెలంగాణ‌తో పాటు చ‌త్తీస్ గ‌డ్‌, రాజ‌స్తాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీలకు కూడా ఎన్నిక‌ల‌కు జ‌ర‌పాలి. కానీ, ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ లీడ‌ర్లు సాధార‌ణ ఎన్నిక‌ల‌తో అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని కోరుతున్నార‌ట‌. ఆ దిశ‌గా ఆలోచిస్తే వ‌చ్చే ఏడాది మార్చిలో లోక్ స‌భ‌తో పాటు తెలంగాణ‌, చ‌త్తీస్ గ‌డ్‌, రాజస్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌కు జ‌రిగే అవ‌కాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీ గడువు ఈ ఏడాది డిసెంబ‌ర్

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల ఆధారంగా బీజేపీ తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఒక వేళ క‌ర్ణాట‌క రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేక ప‌వ‌నాలు వీస్తే మాత్రం సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ ఎన్నిక‌ల‌ను(Telangana Election) కూడా తీసుకెళ్ల‌డానికి అవ‌కాశం ఉంది. ముంద‌స్తుకు వెళ్లాల‌ని మోడీ స‌ర్కార్ కూడా యోచిస్తున్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల స‌మాచారం. ఖ‌ర్చుతో పాటు ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హిస్తే బీజేపీకి క‌లిసొచ్చే అవ‌కాశాలు మెండు. అందుకే, లోక్ స‌భ‌తో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని బీజేపీ లీడ‌ర్లు భావిస్తున్నార‌ట‌. ప్ర‌స్తుతం రాజ‌స్థాన్, చ‌త్తీస్ గ‌డ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో బీజేపీ ఉన్న‌ప్ప‌టికీ బ‌లమైన మెజార్టీ లేదు. ఇక తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌ప‌డ‌లేదు.

లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను (KCR)

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వాతో లోక్ స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని బీజేపీ అంచ‌నా. అదే హ‌వా రాష్ట్రాల్లోనూ ప‌నిచేస్తుంది. ఆ విష‌యం గ‌తంలో జ‌రిగిన ఎన్నిక చ‌రిత్ర చెబుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన కేసీఆర్ (KCR) 2018లో అధికారాన్ని అందుకోగ‌లిగారు. కేవ‌లం ఒక ఎమ్మెల్యేను మాత్ర‌మే గెలుచుకోగ‌లిగింది. ఆ త‌రువాత నాలుగు నెల‌ల‌కు జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది. అంటే, బీజేపీ అనూహ్యంగా బ‌ల‌ప‌డింది. ఇలాంటి ప‌రిణామాలు ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ చూసింది. అందుకే, లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో పాటు ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని చూస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను వ‌చ్చే ఏడాది మార్చిలో

ఒక వేళ లోక్ స‌భ ఎన్నిక‌ల‌తో ఆయా రాష్ట్రాల ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తే కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేయాలి. ఆ మేర‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ కు తెలియ‌చేయాలి. అప్పుడు ఎన్నిక‌ల‌కు క‌మిష‌న్ కు ఉండే విశిష్టాధికారాల‌తో తెలంగాణ‌తో పాటు మిగిలిన రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు వాయిదా వేసుకోవచ్చు. గతంలోనూ ఉమ్మ‌డి ఏపీ ఉన్న‌ప్పుడు తొమ్మిది నెల‌లుగా ముందుగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు ప్లాన్ చేశారు. కానీ, ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఉండే విశిష్టాధికారం ఉప‌యోగించి లోక్ స‌భ ఎన్నిక‌ల వ‌ర‌కు వాయిదా వేసింది. ఫ‌లితంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఒకేసారి 2004లో ఎన్నిక‌ల‌కు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను(Telangana Election) వ‌చ్చే ఏడాది మార్చిలో నిర్వ‌హించాల‌ని బీజేపీ లీడ‌ర్లు భావిస్తున్నారు.

Also Read : BRS :మ‌రాఠాపై KCRఎత్తుగ‌డ‌,BRS ఔరంగాబాద్ స‌భ‌

తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) మాత్రం 2018 ఎన్నిక‌ల్లో మాదిరిగా మ‌రోసారి విజ‌యం సాధించ‌డానికి అక్టోబ‌ర్ నెల‌లో ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని భావిస్తున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్ల‌ను కూడా చేస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఎన్నిక‌ల క‌మిష‌న్ కు పాజిటివ్ సంకేతాలు కూడా వెళ్లాయి. లైజ‌నింగ్ లో ఆరితేరిన కేసీఆర్ ముందస్తు ఎన్నిక‌ల‌కు బ్లూ ప్రింట్ ర‌చించారు. ఆందుకే, నాలుగు నెల‌ల పాటు నిరంత‌రంగా ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల్లో ఉండాల‌ని ఆదేశించారు. పైగా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా రూపాంత‌రం చెందిన త‌రువాత అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను (Telangana Election) ముందస్తుగా నిర్వ‌హించుకోవాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి దేశ వ్యాప్తంగా ప్ర‌చారం చేయ‌డానికి అనువుగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కేసీఆర్ (KCR) అనుకున్న విధంగా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు జ‌రుగుతాయా? బీజేపీ నేత‌లు కేంద్రానికి చెబుతోన్న విధంగా సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతాయా? అనేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశం అయింది.

Also Read : BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు, జాతీయ రాజకీయాలే లక్ష్యం!