Site icon HashtagU Telugu

Telangana Election Results 2023 : 9 తర్వాతే ఫస్ట్ ఫలితం

Telangana Election Results 2023- first result update

Telangana Election Results 2023- first result update

తెలంగాణ ఎన్నికల ఫలితాలు (Telangana Election Results) మరికొద్ది గంటల్లో వెల్లడికాబోతున్నాయి. ఈ ఫలితాలపై తెలంగాణ వ్యాప్తంగానే కాదు…దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది ఉంది. కేవలం ఆసక్తి మాత్రమే కాదు జోరుగా కోట్లలో బెట్టింగులు నడుస్తున్నాయి. మొత్తం 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలలో ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు చెపుతున్నారు. ఆ తర్వాత ఈవీఎంలను లెక్కించడం మొదలుపెడతామని వివరించారు. ప్రతీ ఈవీఎంను మూడుసార్లు లెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని సీఈవో వికాస్ రాజ్ చెప్పుకొచ్చారని కానీ ..మొదటి ఫలితం మాత్రం 10 గంటల లోపే వస్తుందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

కౌంటింగ్‌ కోసం మొత్తం 17వందల 66 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 500 పోలింగ్‌ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్‌, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది ఉండనున్నారు. ఒక్కో టేబుల్‌ దగ్గర మైక్రో అబ్జర్వర్, ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను కేటాయించారు. ఇక చిన్న నియోజకవర్గంలో ఉదయం 10గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.

మరోపక్క ఈవీఎంలు భద్రపరిచిన గదుల దగ్గరకు ఎవరినీ అనుమతించడం లేదు. స్ట్రాంగ్‌ రూంల దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంది. డీసీపీ స్థాయి అధికారి ఇద్దరు సీఐలు, నలుగులు ఎస్‌ఐలతో పాటు కేంద్ర బలగాలు స్ట్రాంగ్‌ రూముల దగ్గర పహారా కాస్తున్నాయి. మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల దగ్గర బందోబస్తు విధుల్లో ఉంచారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోనే ఉంటుంది.

Read Also : Shah Rukh Khan: ‘డుంకీ’ మూవీ హిట్ కొట్టడం పక్కా: షారుక్ ఖాన్