ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Election Results ) కు సంబదించిన లెక్కింపు రోజు రానేవచ్చింది. తెలంగాణ లో కారు జోరెంత..? చేతి బలమెంత..? దుమ్ము రేపేది ఎవరు..? దెబ్బ తినేది ఎవరు..? అనేది తెలియనుంది.
పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలిపిందని బిఆర్ఎస్ (BRS) చెప్పుకొచ్చింది..ఇదే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని, కచ్చితంగా హ్యాట్రిక్ కొడతామనే ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు.. ఇదే సమయంలో కాంగ్రెస్ (Congress) సైతం పదేళ్ల కుటుంబ పాలనకు అంతం పలకాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తూ వచ్చారు. ఇవి దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య ఎన్నికలని, ఒక్కసారి తమకు అవకాశం ఇచ్చి చూస్తే అసలైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ప్రజల ముందు చెప్పుకొచ్చారు. మరి ప్రజలు ఎవరి మాటలు నమ్మి ఓటు వేశారు..? ఎవర్ని సీఎం పదవిలో కుర్చోపెట్టాలని డిసైడ్ అయ్యారు..? ఏ పార్టీ వస్తే తమకు మేలు జరుగుతుందని భావించారు..? అనేది మరికాసేపట్లో తెలియనుంది.
We’re now on WhatsApp. Click to Join.
గత నెల 30న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 3,26,02,793 ఓట్లకు గానూ.. 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు వేశారు. 1 ,80 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి. బరిలో నిలిచిన 2290మంది అభ్యర్ధుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 49 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 1766 టేబుల్స్ ను ఏర్పాటు చేసింది. ఒక్కొక్క సిగ్మెంట్ కు 14రౌండ్ల మేర లెక్కింపు జరుగుతుంది. ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు.
ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లను కౌంటింగ్ మొదలుపెట్టనున్నారు. భద్రాచలం, అశ్వారావుపేట, చార్మినార్ నియోజకవర్గాల్లో లెక్కింపు రౌండ్లు తక్కువగా ఉండడంతో.. వీటిలో ఏదొక స్థానం నుంచి మొదటి ఫలితం వెలువడే అవకాశం ఉంది. చార్మినార్ లో పోలైన ఓట్లు అతి తక్కువగా ఉండటంతో మిగిలిన రెండింటి కంటే అక్కడి నుంచి మొదటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా గెలుపు ఏ పార్టీది అనేది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈవీఎంల ఓట్ల లెక్కింపు మొదలైన ప్రతి 15 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది.
Read Also : Bandla Ganesh : ఏ క్షణం ఏం జరుగుతుందో..ప్రతి కార్యకర్త కాపలా కాయండి – బండ్ల గణేష్