Site icon HashtagU Telugu

TS Polls Results : హైదరాబాద్ కు ఏఐసీసీ అగ్ర నేతలు..అభ్యర్థులంతా రావాలని ఆదేశం

Ts Results

Ts Results

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబదించిన లెక్కింపు రేపు జరగబోతుంది..ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారా అనేదానిపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ విజయం సాదించబోతుందని తేల్చి చెప్పాయి. అయినప్పటికీ అధికార బిఆర్ఎస్ మాత్రం హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇరు పార్టీల ధీమా తో ఉండడంతో ప్రజలు ఎవరికీ పట్టం కట్టరనేది దానిపై చర్చ నడుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె కాంగ్రెస్ గెలుస్తుందన్న ఊహగానాల మధ్య కాంగ్రెస్ హై కమాండ్ అప్రమత్తం అయింది. గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు అధిష్టానం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి చాలా పకడ్బందీగా వ్యవహరించేందుకు సమాయత్తమవుతోంది. తమ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయంలో పరిస్థితిని పరిశీలించేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపిస్తోంది. మరికాసేపట్లో డీకే శివకుమార్ హైదరాబాద్ కు రానున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పలు సూచనలు చేసింది.. గెలిచిన అభ్యర్థులు ఆదివారం సాయంత్రం హైదరాబాద్ కు రావాలని ఆదేశించింది. వీరితో పాటు ఏఐసీసీ పరిశీలకులు తెలంగాణకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చిదంబరం, సుశీల్‌ కుమార్‌ షిండే, సూర్జేవాలాకు టీకాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యతలను అప్పగించింది. రేపు ఉదయాన్నే చిదంబరం, షిండే, సూర్జేవాలా హైదరాబాద్‌కు రానున్నారు.

Read Also : Khammam : ఖ‌మ్మంలో కౌంటింగ్ కేంద్రాల వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌.. ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీపీ