Site icon HashtagU Telugu

Telangana : ప్ర‌శ్నాప‌త్రాల లీక్ ద‌ర్యాప్తులో ఈడీ దూకుడు

TSPSC Exams Reschedule

Tspsc

తెలంగాణ‌లో(Telangana) ప్ర‌శ్నాప‌త్రాల లీక్ (Papers leak)ద‌ర్యాప్తు రోజుకో ర‌కంగా మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌భుత్వం సేఫ్ గా ఆరోప‌ణ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డింది. తొలి రోజుల్లో విప‌క్షాల లీడ‌ర్లు దుమ్మెత్తిపోసిన‌ప్ప‌టికీ ఆ త‌రువాత వాళ్ల‌నే టార్గెట్ చేయ‌డంతో సైలెంట్ అయ్యారు. ఫ‌లితంగా ప్ర‌భుత్వం ఒక సిట్ ను వేసి మౌనంగా ఉంది. కానీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం ఒక అడుగు ముందుకేసింది. పేప‌ర్ల లీకేజీ కేసులో నిందితులు ఐదుగురిని క‌స్ట‌డీకి ఇవ్వాల‌ని తాజాగా కోర‌డం ఈ కేసు విచార‌ణ‌పై ఆస‌క్తి పెరిగింది.

తెలంగాణ‌లో ప్ర‌శ్నాప‌త్రాల  లీక్  రోజుకో ర‌కంగా మ‌లుపులు (Telangagna)

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ(Papers leak) కేసులో ఐదుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో (Telagana)పిటిషన్ దాఖలు చేశారు. దాని ప్ర‌కారం వాళ్ల‌ను జైలులోనే విచారిస్తామ‌ని కోరింది. నిందితులు రేణుక, డాక్యానాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్‌ల నుంచి వాంగ్మూలం తీసుకునేందుకు అనుమతించాలని కోరారు. చంచల్‌గూడ జైలులోనే నిందితులను ప్రశ్నించడానికి అనుమతించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు జైలు పర్యవేక్షకుడిని ఆదేశించాలని కోరడంతో నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

కౌంటర్ పిటిషన్ అనంతరం.. 

నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశాక వాదనలు జరిగే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్ గూడ జైల్లో విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రాంచంద్రన్, అధికారులు సత్యనారాయణ, శంకరలక్ష్మిలను కార్యాలయానికి పిలిచి వాళ్ల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు (Telangana)

ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులు రేణుక, రమేష్, ప్రశాంత్ రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, నీలేష్ నాయక్‌లతో పాటు ఇతర నిందితులు కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సిట్ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసిన తర్వాత నిందితుల బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ (Telangana)అధికారులు ఇప్పటి వరకు 27మందిని అరెస్ట్ చేశారు.

Also Read : TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేణుకాతో పాటు మరో ఇద్దరికి బెయిల్.. కానీ ఈ షరతులు ఫాలో కావాల్సిందే..!

విదేశాల నుంచి డ‌బ్బు హ‌వాలా మార్గంలో ఈ పేప‌ర్ల కొనుగోలుకు వ‌చ్చింద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ కోణం నుంచి ఈడీ ద‌ర్యాప్తు చేస్తోంది. ఇప్ప‌టికే ఈ లీకేజీ వ్య‌వ‌హారాన్ని రాజ‌కీయ కోణం నుంచి బీఆర్ఎస్ తీసుకెళుతోంది. బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజ‌య్ ను అరెస్ట్ చేసిన త‌రువాత పేప‌ర్ల లీకులు లేవ‌ని చెబుతోంది. అంటే, ఆయ‌న పేప‌ర్ల‌ను లీకు చేశార‌ని మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం చూసింది. ప్ర‌ధాన పార్టీల లీడ‌ర్ల‌కు సిట్ నోటీసులు ఇవ్వ‌డంతో వాళ్లు నిమ్మ‌కుండి పోయారు. ఇప్పుడు ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పైన ఈ లీక్ స్కామ్ విచార‌ణ ఆధార‌ప‌డి ఉంది.

Also Read : TSPSC Paper Leak Case: TSPSC పేపర్ లీకేజీ నిందితుల్ని ప్రశ్నిస్తున్న ఈడీ…