Eamcet Result : ఎంసెట్‌ రిజల్ట్స్.. ఐసెట్ హాల్ టికెట్స్.. పాలిసెట్ కౌన్సెలింగ్

తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్ (Eamcet Result) రేపు (మే 25న) రిలీజ్ కానున్నాయి.

Published By: HashtagU Telugu Desk
JEE Main Result

Eamcet Result

తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్ (Eamcet Result) రేపు (మే 25న) రిలీజ్ కానున్నాయి. గురువారం ఉదయం 11 గంటలకు కూక‌ట్‌ప‌ల్లి జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను(Eamcet Result) విడుద‌ల చేయ‌నున్నారు. మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ స్ట్రీమ్‌ ఎగ్జామ్.. మే 12 నుంచి 15 వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ ఎగ్జామ్స్ జరిగాయి. ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను  దాదాపు 2లక్షల మంది రాయగా.. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షకు లక్ష మందికి పైగా రాశారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను తెలుసుకోవ‌చ్చు. రిజల్ట్స్ కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్ ను చూడొచ్చు.

also read : Jobs With Ms Excel : MS EXCEL వస్తే..ఎక్సలెంట్ జాబ్స్

ఐసెట్‌ హాల్‌టికెట్లు .. 

తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. వాటిని డౌన్ లోడ్ చేసుకోవాలనుంటే https://icet.tsche.ac.in/ లింక్ ను క్లిక్ చేయండి. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

also read : Tech Companies: వామ్మో ఐటీ.. 2023లో 2 లక్షల ఉద్యోగాలు ఔట్!

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌..  

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ జరగనుంది. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లిస్తే సరిపోతుంది. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించనున్నారు.

  Last Updated: 24 May 2023, 08:54 AM IST