TS DSC 2024 : 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కారు ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. గత ప్రభుత్వం 5089 పోస్టులతో ఇచ్చిన నోఫిటికేషన్ రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ (SA) పోస్టులు 2629, భాషా పండితుల పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182, ఎస్జీటీ (SGT) పోస్టులు 6,508 ఉన్నాయి. ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220, ఎస్జీటీ పోస్టులు 796 ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులు అందించిన పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, నూతన డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
- అత్యధిక ఉపాధ్యాయ ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.
- హైదరాబాద్‌లో మొత్తం 878 పోస్టులు ఉండగా నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్‌లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506, రాజన్న సిరిసిల్ల 151, వనరపర్తి 152 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
- అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 93 ఖాళీలు మాత్రమే ఉన్నాయి.
- రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 4 లక్షల మంది TET ఉత్తీర్ణులైనవారు ఉన్నారు.
- డీఎస్సీ పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 4 నుంచి షురూ చేసి ఏప్రిల్ 2వ తేదీ వరకు తీసుకోనున్నారు.
- దరఖాస్తు రుసుము రూ.1000గా నిర్ణయించారు.
- మే నెల లేదా జూన్ నెలలో డీఎస్సీ ఎగ్జామ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also Read : Railway Unions : మే 1 నుంచి రైళ్లన్నీ ఆపేస్తాం.. కేంద్రానికి రైల్వే యూనియన్ల వార్నింగ్
జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టులివీ..
- ఆదిలాబాద్ – 324
- భద్రాద్రి కొత్తగూడెం – 447
- హన్మకొండ – 187
- హైదరాబాద్ – 878
- జగిత్యాల – 334
- జనగామ – 221
- జయశంకర్ – 237
- జోగుళాంబ గద్వాల – 172
- కామారెడ్డి – 506
- కరీంనగర్ – 245
- ఖమ్మం – 575
- కుమరం భీం ఆసిఫాబాద్ – 341
- మహబూబాబాద్ – 381
- మహబూబ్ నగర్ – 243
- మంచిర్యాల – 288
- మెదక్ – 310
- మేడ్చల్ మల్కాజిగిరి – 109
- ములుగు – 192
- నాగర్ కర్నూల్ – 285
- నల్గొండ – 605
- నారాయణపేట – 279
- నిర్మల్ – 342
- నిజామాబాద్ – 601
- పెద్దపల్లి – 93
- రాజన్న సిరిసిల్ల – 151
- రంగారెడ్డి – 379
- సంగారెడ్డి – 551
- సిద్దిపేట – 311
- సూర్యాపేట – 386
- వికారాబాద్ – 359
- వనపర్తి – 152
- వరంగల్ – 301
- యాదాద్రి భువనగరి – 277