Site icon HashtagU Telugu

Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు విడుద‌ల‌.. చెక్ చేసుకోండిలా..!

RRB JE Results

RRB JE Results

Telangana DSC Results: తెలంగాణ డీఎస్సీ ఫ‌లితాలు (Telangana DSC Results) విడుద‌ల‌య్యాయి. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స‌చివాల‌యంలో ఫలితాల‌ను విడుద‌ల చేశారు. అంతేకాకుండా ఫ‌లితాల్లో స‌త్తా చాటిన‌వారికి సీఎం రేవంత్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ అభినందించారు. అర్హ‌త సాధించనివారు బాధ‌ప‌డే ప‌నిలేద‌ని, మ‌రో అవ‌కాశం ఉంటుంద‌ని ధైర్యం చెప్పారు. ఇక‌పోతే ఈ ఏడాది మార్చి 1వ తేదీన 11,062 టీచర్​ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. ఈసారి 2.45 లక్షల మంది అభ్యర్థులు DSC పరీక్షలకు హాజ‌రయ్యారు.అయితే పరీక్షలు ముగిసిన తర్వాత 56 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించి స‌రికొత్త రికార్డును సీఎం రేవంత్ ప్ర‌భుత్వం నెల‌కొల్పింది. ఫలితాలను అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgdsc.aptonline.in/tgdsc/లో చెక్‌ చేసుకోవచ్చు.

స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, హైస్కూల్ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఫలితాలను TS DSC అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు అభ్యర్థించారు. TS DSC ఫ‌లితాల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి ఈ క్రింది ద‌శ‌లు అనుస‌రించండి.

Also Read: India vs Bangladesh T20: టీమిండియాకు ధీటుగా బంగ్లాదేశ్ టీ20 జ‌ట్టు..!

చెక్ చేసుకోండిలా

దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం: సీఎం

తక్కువ సమయంలోనే డీఎస్సీ-2024 ఫలితాలు ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘‘1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ ఉంటుంది. దసరాలోపు ఎల్బీస్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీని వేయడమే కాకుండా.. 34,706 మంది టీచర్లను ట్రాన్స్‌ఫర్ చేశాం. నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం’’ అని చెప్పారు.