Telangana DSC Exam Schedule: తెలంగాణ డీఎస్సీ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. జూలై 18 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు..!

Telangana DSC Exam Schedule: తెలంగాణలోని ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్‌ (Telangana DSC Exam Schedule)ను అధికారులు శుక్ర‌వారం విడుద‌ల చేశారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 18న ప‌రీక్ష‌లు ప్రారంభ‌మై.. ఆగ‌స్టు 5 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు. జూలై 18 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ జిల్లా సెలక్షన్ […]

Published By: HashtagU Telugu Desk
Telangana DSC Exam Schedule

Telangana DSC Exam Schedule

Telangana DSC Exam Schedule: తెలంగాణలోని ఉపాధ్యాయ నియామక పరీక్షల షెడ్యూల్‌ (Telangana DSC Exam Schedule)ను అధికారులు శుక్ర‌వారం విడుద‌ల చేశారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. సీబీఆర్‌టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్‌లలో డీఎస్సీ పరీక్షలు జ‌ర‌గ‌నున్నాయి. జూలై 18న ప‌రీక్ష‌లు ప్రారంభ‌మై.. ఆగ‌స్టు 5 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.

జూలై 18 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ జిల్లా సెలక్షన్ కమిటీ (టీజీ డీఎస్సీ) 2024 వివరణాత్మక పరీక్షల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. జూలై 18న తెలుగు మాధ్యమంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టుల (సోషల్ స్టడీస్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులు) మొదటి షిఫ్ట్‌లో డిఎస్‌సి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ, తెలుగు మీడియంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల పరీక్ష ఉంటుంది. అదే రోజు రెండవ షిఫ్ట్‌లో ఈ ప‌రీక్ష‌లు నిర్వహించ‌నున్నారు. ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు.

Also Read: UGC NET 2024: యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు ప్ర‌క‌టన‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన ఎన్టీఏ..!

ఏరోజు ఏ ప‌రీక్ష అంటే!

  • జూలై 18- మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, రెండో షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ పరీక్ష
  • జూలై 19- సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జూలై 20- ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు
  • జూలై 22- స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష
  • జూలై 23- సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష
  • జూలై 24- స్కూల్ అసిస్టెంట్ – బయలాజికల్ సైన్స్ పరీక్ష
  • జూలై 25- స్కూల్ అసిస్టెంట్ తెలుగు, ఉర్దూ, మరాఠీ పరీక్షలు
  • జూలై 26- తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష
  • జూలై 30- స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

మొత్తం దరఖాస్తులు 2.79 లక్షలు..!

ఇక‌పోతే రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ విడుద‌ల చేసింది. అయితే అభ్య‌ర్థుల విన‌తి మేరకు ఈ డీఎస్సీ దరఖాస్తుల గడువు ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు పొడిగించింది. అయితే 11,062 పోస్టుల‌కు గాను మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు అందిన‌ట్లు అధికారులు తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 29 Jun 2024, 09:18 AM IST