Site icon HashtagU Telugu

Telangana Debt: పదేళ్లలో దొర తెచ్చిన అప్పులు 5లక్షల కోట్లు

Telangana Debt

New Web Story Copy 2023 07 13t154512.259

Telangana Debt:  తెలంగాణ అధికార పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్న వైఎస్ షర్మిల తాజాగా సీఎం కేసీఆర్ చేసిన అప్పుల లెక్కలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ పదేళ్లలో చేసిన అప్పులపై షర్మిల మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కేసీఆర్ 10 ఏళ్లుగా చేసిన అప్పులతో రాష్ట్రం దివాళా తీసిందన్నారు షర్మిల. పరిమితి మించి దొర తెచ్చిన అప్పులు అక్షరాల 5లక్షల కోట్లు అంటూ పేర్కొన్నారు. .ఇంత అప్పు చేసినా ఖజానా ఖల్లాస్ అంటూ విమర్శించారు.పథకాల నుంచి బిల్లుల చెల్లింపుల దాకా అన్ని బంద్ అయ్యాయని ఆరోపించింది షర్మిల. కాంట్రాక్టర్లకు బిల్లుల కింద 37 వేల కోట్లు, డిస్కంలకు 25 వేల కోట్లు, ఆరోగ్యశ్రీకి వెయ్యి కోట్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద 5 వేల కోట్లు,సున్నా వడ్డీలకు 17వేల కోట్లు,ఆర్టీసీకి 4 వేల కోట్లు,రుణమాఫీ కింద 6 వేల కోట్లు,ఇలా చెప్పుకుంటూ పోతే దొర బాకీల జాబితా చాంతాడు కన్నా పొడువే ఉంటుందని చెప్పారు.

అభివృద్ధికి అప్పులు తెస్తే తప్పా అని కేసీఆర్ అడుగుతారని అయితే తెచ్చిన డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టినట్లు అని ప్రశ్నించారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి అర చేతిలో 3D చూపి.. కమీషన్ల కింద దొర ఖజానాకే నిధులు అన్ని దారి మళ్లినయ్ అని సంచలన ఆరోపణలకు పాల్పడ్డారు షర్మిల. పనికి రాని ప్రాజెక్ట్ చెప్పి తెచ్చిన అప్పులు దొర కడుపు నింపినయ్ కానీ తెలంగాణ ప్రజలకు మేలు చేయాలె అన్నారు. తెలంగాణ ప్రజల ఒక్కో తలపై 2లక్షల అప్పు ఉందన్నారు. ఆఖరికి ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటూ ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రం అంటూ ప్రగల్భాలు పలుకుతూనే.. తెలంగాణను మరో 40 ఏండ్లు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఖాళీ బిందెకు బంగారు పూత,ఇదే కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ అంటూ సెటైర్స్ పేల్చారు.

Read More: Pragya Jaiswal : గోల్డ్ కలర్ అవుట్ ఫిట్ లో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్