Site icon HashtagU Telugu

Telangana Dasara Holidays: దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం 15 రోజులు!

Schools Kcr

Schools Kcr

విద్యాసంస్థలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు మొత్తం 13 రోజులను దసరా సెలవులుగా TS ప్రభుత్వము ప్రకటించింది.సెప్టెంబర్ 25, అక్టోబర్ 9వ తేదీన ఆదివారం అవడంతో మొత్తం 15 రోజులు సెలవు దినాలుగా ఉంటాయి.విద్యా సంస్థలు తిరిగి అక్టోబర్ 10వ తేదీ సోమవారం ప్రారంభం అవుతాయి.

తెలంగాణ ఏర్పడిన తర్వాత సంక్రాంతికి సెలవులను తగ్గించి… బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులను పెంచిన సంగతి తెలిసిందే. దుర్గా పూజ అనేది దుర్గాదేవికి అంకితం. తొమ్మిది రోజుల హిందూ పండుగ. నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా చాలా ఆనందంగా జరుపుకుంటారు. తెలంగాణలో దసరా ఉత్సవాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ప్రభుత్వం దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది.