Telangana CS :మోడీ దెబ్బ‌కు`మాజీ సీఎస్`ఠా! 12 మంది IAS, IPSల‌పై ప్ర‌భావం!

  • Written By:
  • Publish Date - January 13, 2023 / 12:21 PM IST

సీనియ‌ర్ ఐఏఎస్, మాజీ తెలంగాణ చీఫ్ సెక్ర‌ట‌రీ సోమేశ్ కుమార్ (Telangana CS) బ‌దిలీ వ్య‌వ‌హారం వెనుక ఏమి జ‌రిగింది? రాజ‌కీయ మ‌కిలీ బాగా ఉన్న అధికారి ఆయ‌న‌. ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ (Modi)ఇటీవ‌ల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌తో నిర్వ‌హించిన స‌మావేశానికి గైర్హాజ‌ర‌య్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప‌ట్ల స్వామిభ‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తూ ఈనెల 6,7 తేదీల్లో జ‌రిగిన మోడీ (Modi) స‌మావేశానికి డుమ్మా కొట్టారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎస్ లు పాల్గొన‌గా, కేవ‌లం సోమేశ్ కుమార్ (Telangana CS)  మాత్ర‌మే గైర్హాజ‌ర‌య్యారు. ఆ రోజు నుంచి ఆయ‌న‌కు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది.

సోమేశ్ కుమార్ బ‌దిలీ వ్య‌వ‌హారం వెనుక..(Telangana CS) 

తొలి నుంచి ఆయ‌న మీద ప‌లు ఫిర్యాదులు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు ఆయ‌న తెలంగాణ సీఎస్ గా ప‌నిచేయ‌డం వెనుక కేసీఆర్ రాజ‌కీయ వ్యూహం ఉంది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ క‌మిష‌న‌ర్ హోదాలో ఎన్నిక‌ల సంద‌ర్భంగా 2015లో స్వామిభ‌క్తిని సోమేశ్ ప్ర‌ద‌ర్శించారు. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా గ్రేట‌ర్ల‌లోని ఓట‌ర్ల‌ను వేలాది మందిని తొల‌గించారు. ఫ‌లితంగా తొలిసారిగా గ్రేట‌ర్ పాల‌న టీఆర్ఎస్ చేతిలోకి వ‌చ్చింది. ఆ రోజు నుంచి సోమేశ్ కుమార్ గులామ్ గిరీ ప్రారంభం అయింద‌ని కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిథ‌ర్ రెడ్డి అప్ప‌ట్లో ప‌లు ఆరోప‌ణ‌లు గుప్పించారు. గ‌త ఎన్నిక‌ల్లో సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అన్ని ర‌కాల స‌హాయ‌స‌హ‌కారాలు అందించారు. ఈసారి కూడా ఆయ‌న సేవ‌లను ఉప‌యోగించుకుని మూడోసారి గెలుపు కోసం కేసీఆర్ ప్లాన్ చేశారట‌. కానీ, ఆక‌స్మాత్తుగా సీన్ రివ‌ర్స్ అయింది.

Also Read : CS Somesh Kumar: సీఎస్ సోమేష్ కు షాక్.. ఏపీకి వెళ్లాలని హైకోర్టు ఆదేశం!

ఇప్ప‌టి వ‌ర‌కు సోమేశ్ కుమార్ మీద సుమారు 376 వివాద‌స్ప‌ద‌మైన ఫిర్యాదులు ఉన్నాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల ఆయ‌న మీద విచార‌ణ జ‌ర‌పాల‌ని విప‌క్ష నేత‌లు డిమాండ్ చేశారు. ప్ర‌ధానంగా జీవో 111 విడుద‌ల‌, ధ‌ర‌ణి త‌దిత‌ర భూముల ఇష్యూల్లో అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటి మీద ద‌ర్యాప్తు సంస్థ‌ల వ‌ద్ద ఫిర్యాదులు అనేకం ఉన్నాయి. ఇలాంటి వివాద‌స్ప‌ద సీఎస్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను రిలీవ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి పంపాలని తెలంగాణ హైకోర్టు జనవరి 10న ఆదేశించింది. అంతేకాదు, 48 గంటల్లోగా ఏపీకి వెళ్లిపోవాల‌ని కేంద్ర ప్రభుత్వం కుమార్‌ను ఆర్డ‌ర్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కెసిఆర్)కూడా కేంద్రం ఆదేశానుసారంగా మారమని సోమేశ్ కుమార్ కు స‌ల‌హా ఇవ్వ‌డం పెద్ద ట్విస్ట్‌.

చ‌ట్ట‌విరుద్ధంగా ప‌నిచేస్తోన్న సుమారు 12 మంది IAS మరియు IPS

పలువురు సీనియర్ల వాదనలను పట్టించుకోకుండా డిసెంబర్ 31, 2019 నుంచి కుమార్‌ను ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ ను కేసీఆర్ ఎంపిక చేయ‌డం జ‌రిగింది. 1989 బ్యాచ్ బ్యూరోక్రాట్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ ఉన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మరియు శిక్షణ విభాగం (డిఓపిటి) దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందాలతో కూడిన ధర్మాసనం అనుమతించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్ర‌కారం డిఓపిటి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను కేటాయించింది. కుమార్ డిఓపిటి కేటాయింపును సవాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు కేటాయిస్తూ CAT నుండి అనుకూలమైన ఉత్తర్వును మార్చి 29, 2016న పొందారు. హైకోర్టు బెంచ్ CATని తీవ్రంగా తప్పుబట్టింది. ఆ ఉత్తర్వును రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం కేడర్‌ను నియంత్రించే అధికారం CAT కు లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఫ‌లితంగా చ‌ట్ట‌విరుద్ధంగా రెండు రాష్ట్రాల్లో ప‌నిచేస్తోన్న సుమారు 12 మంది IAS మరియు IPS అధికారుల ఎంపిక‌పై తెలంగాణ హైకోర్టు నిర్ణయం ప్రభావం ప‌డ‌నుంది.

Also Read : CS Somesh Kumar : కేసీఆర్ పై బీజేపీ తొలి విజ‌యం! సీఎస్ గా సోమేష్ ఔట్‌?

వాస్త‌వంగా ఐఎఎస్ అధికారులకు వారికి నచ్చిన కేడర్ లేదా సొంత‌ రాష్ట్రంలో కేటాయించేలా ప్ర‌య‌త్నించే అధికారం లేదు. కేడ‌ర్ కేటాయింపు పూర్తిగా ఆల్ ఇండియా సర్వీస్ కింద‌కు వ‌స్తోంది. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సేవ చేయడానికి సివిల్ స‌ర్వెంట్స్ సిద్ధంగా ఉండాలి. నిర్దిష్ట కేడర్ కావాల‌ని కోరుతూ క్లెయిమ్ చేసే హక్కు సివిల్ స‌ర్వెంట్ల‌కు లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అందుకు భిన్నంగా సోమేశ్ కుమార్ తో పాటు 12 మంది అధికారులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్నారు. వాళ్లు కూడా సోమేశ్ త‌ర‌హాలో ఎవ‌రి స్టేట్ కు వాళ్ల వెళ్లాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

శాంతి కుమారిని సీఎస్ గా

ప్ర‌స్తుతం సోమేశ్ క‌మార్ స్థానంలో 1989 బ్యాచ్‌కి చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీ) శాంతి కుమారిని సీఎస్ గా కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. ఆమె పదవీకాలం ఏప్రిల్ 2025 వరకు ఉంటుంది. ఇలాంటి ఎంపిక‌లు ఇటీవ‌ల కాలంలో పూర్తిగా ఆ రాష్ట్ర సీఎంల నిర్ణ‌యం మీద ఆధార‌ప‌డి ఉంద‌ని బ్యూరోక్రాట్లు విశ్వ‌సిస్తున్నారు. సమర్థత, సీనియారిటీ కంటే విధేయ‌త‌కు ప్రాధాన్యం ఇస్తూ డీజీపీ, సీఎస్ ల ఎంపిక జ‌రుగుతోంది. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు పార్టీలు ఉన్న‌ప్పుడు ఇలాంటి ఎంపిక సంక్లిష్టంగా ఉంటోంది. తెలంగాణ సీఎస్ గా సుదీర్ఘ కాలం సోమేశ్ పనిచేయానికి కార‌ణం కూడా కేసీఆర్ కు విధేయునిగా ఉండ‌డ‌మే.

Also Read : Chief Minister KCR: కేసీఆర్ ఎన్నికల వరాలు రెడీ..!

తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చీఫ్ సెక్రటరీగా, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమీషనర్‌గా, భూముల డిజిటలైజేషన్‌లో సోమేశ్ పాత్ర ఉంది. భూములు, వాటి అనుబంధ‌ సమస్యలపై ఆయ‌న తీసుకున్న‌ నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎ. రేవంత్ రెడ్డి కోరుతున్నారు. 2023 చివరిలో IAS నుండి పదవీ విరమణ చేయబోతున్న ఆయ‌న‌, జనవరి 12న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అక్క‌డ ఏ ప‌ద‌వి ఇచ్చిన‌ప్ప‌టికీ కొన‌సాగుతాన‌ని సోమేశ్ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం. ఎందుకంటే, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన వెంట‌నే ఆయ‌న మీదున్న ఫిర్యాదులు మ‌రింత వేగం పుంజుకునే అవ‌కాశం ఉంది.