Site icon HashtagU Telugu

CPM List: కాంగ్రెస్‌తో కటీఫ్.. CPM అభ్యర్థుల జాబితా విడుదల

Cpm List

Cpm List

CPM List: సీపీఎం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీపీయం కాంగ్రెస్ దోస్తీకి గుడ్ బై చెప్తూ ఒంటరిగా పోటీకి దిగేందుకు నిర్ణయం తీసుకుంది. తాజాగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇందులో 14 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం ప్రకటనను విడుదల చేసింది.

సీపీఐ పోటీ చేసే స్థానాలు – అభ్యర్థులు

మిర్యాలగూడ – జూలకంటి రంగారెడ్డి
నకిరేకల్‌ (ఎస్సీ) – చినవెంకులు
భువనగిరి – కొండమడుగు నర్సింహ
జనగాం – మోకు కనకారెడ్డి
భద్రాచలం (ఎస్టీ) – కారం పుల్లయ్య
అశ్వారావుపేట (ఎస్టీ) – పిట్టల అర్జున్‌
పాలేరు – తమ్మినేని వీరభద్రం
మధిర (ఎస్సీ) – పాలడుగు భాస్కర్‌
వైరా (ఎస్టీ) – భూక్యా వీరభద్రం
ఖమ్మం – ఎర్ర శ్రీకాంత్‌
సత్తుపల్లి (ఎస్సీ) – మాచర్ల భారతి
పటాన్‌చెరు – జె. మల్లికార్జున్‌
ముషీరాబాద్‌ – ఎం. దశరథ్‌
ఇబ్రహీంపట్నం – పగడాల యాదయ్య

Also Read: Telangana: విపక్షాలపై కేసీఆర్ నిరంకుశ విధానాలు