Site icon HashtagU Telugu

GO 16 : జీవో 16ను కొట్టేసిన హైకోర్టు.. జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వేలాది మందికి టెన్షన్

HC strikes down GO 16

GO 16 : జీవో 16ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈ జీవో ద్వారా దాదాపు 5వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చట్టపరంగా చెల్లదంటూ కీలక తీర్పును వెలువరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధమని వెల్లడించింది. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయకుండా.. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని  హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Also Read :Google Chrome Sale : అమెరికా న్యాయశాఖ వర్సెస్ గూగుల్.. క్రోమ్‌ బ్రౌజర్‌‌ను అమ్మేస్తారా ?

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాలో జీవో 16ను జారీ చేశాారు. దీని ద్వారా అప్పట్లో విద్య, వైద్య శాఖలకు చెందిన దాదాపు 5వేల మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్(GO 16) చేశారు. ఇలా జాబ్స్ రెగ్యులరైజ్ అయిన వారిలో ఎంతోమంది డిగ్రీ, జూనియర్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల లెక్చరర్లు ఉన్నారు. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ  తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. జీవో 16 చట్టప్రకారం చెల్లదని తెలిపింది. ఈ తీర్పుతో గతంలో జీవో 16 ఆధారంగా రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగులను ఆందోళనలు ఆవరించాయి. హైకోర్టు తీర్పు కారణంగా తమ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని వారు కలవరపడుతున్నారు. దీనిపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ? బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాలు రెెగ్యులరైజ్ అయినా వేలాది మంది భవితవ్యం విషయంలో రేవంత్ సర్కారు  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read :Gold Loan EMI : ఇక గోల్డ్ లోన్స్‌కూ ‘ఈఎంఐ’ ఆప్షన్స్.. ఎలా అంటే..

ఏయే శాఖలో ఎంతమందిని రెగ్యులరైజ్ చేశారంటే..