Site icon HashtagU Telugu

Revanth Reddy@72: కాంగ్రెస్ కు 72 సీట్లు ఖాయం.. రేవంత్ రెడ్డి ధీమా!

Revanth Reddy

Revanth Reddy

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తమ పార్టీకి 72 సీట్లు పక్కాగా వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల్లో చతుర్ముఖ వ్యూహం అమలు చేస్తామని ఆయన తెలిపారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతందని,  కనీసం 72 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి. పాలసీ(P), క్యాలిక్యులేషన్(C), కమ్యూనికేషన్(C), ఎగ్జిక్యూషన్‌(E).. PCCE అనే చతుర్ముఖ వ్యూహంతో తాము ముందుకెళ్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి.

తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదును తాను క్యాజువల్‌ గా తీసుకోలేదని, చాలా క్యాలిక్యులేటెడ్‌ గా చేశామని చెప్పారు. తెలంగాణలో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి రావాలన్నా 80లక్షల ఓట్లు అవసరమని అన్నారు. కాంగ్రెస్ లో 43 లక్షల మంది సభ్యులుగా చేరారని, పార్టీ సానుభూతిపరులు, పార్టీకి ఓటు వేయాలనుకునే సామాన్య ప్రజలు వీరికి అదనం అన్నారు. ఈసారి తమ లెక్క తప్పదని, అత్యధిక మెంబర్షిప్ తో ఉన్న తమ పార్టీ కచ్చితంగా విజయంసాధిస్తుందన్నారు రేవంత్ రెడ్డి (Revanth Reddy).

తెలంగాణలో కాంగ్రెస్ తో పోటీ పడే ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీ… ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెడతాయని, లేకపోతే ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆ రెండు పార్టీలకు ఫిరాయింపులే ప్రధాన టాస్క్ అన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌ గురించి మాట్లాడేవారు కాదని, హాథ్‌ సే హాథ్‌ జోడో పాదయాత్రల తర్వాత పరిస్థితి మారిందని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.