Site icon HashtagU Telugu

Congress 3rd List : ఈరోజు కాంగ్రెస్ మూడో జాబితా రిలీజ్ చేస్తుందా..?

Jai Congress

Jai Congress

ఎన్నికల పోలింగ్ (Election Polling Date) సమయం దగ్గర పడుతుంది..అభ్యర్థుల నామినేషన్ల పర్వం కూడా జోరుగా నడుస్తుంది..అయినప్పటికీ ఇంకా కాంగ్రెస్ (Congress) పార్టీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా 19 స్థానాలు పెండింగ్ లోనే పెట్టింది. అది కూడా కీలక స్థానాలు. ఆ స్థానాలకు సంబదించిన అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారో..? వారు ఎప్పుడు నామినేషన్ వేయాలో..? ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టాలో..? అని ఆయా స్థానాలకు సంబదించిన అభ్యర్థులు , అభిమానులు , కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఓ పక్క అధికార పార్టీ ప్రచారం దూకుడు కనపరుస్తుంటే..కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించకుండా కాలయాపన చేస్తుందని మండిపడుతున్నారు. ఇదే తరుణంలో ఇక ఎదురుచూసే ఓపిక లేక నియోజక వర్గ ఓటర్లు పార్టీ ని వీడి అధికార పార్టీ లోకి చేరుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్‌ మూడోజాబితా (Congress 3rd List) కొలిక్కివచ్చినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వామపక్షాలతో పొత్తులు, సీట్లు సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మిగిలిన 15 సీట్లలోనూ.. పార్టీ అభ్యర్థుల విషయంలో కొన్నిచోట్ల పోటీ కారణంగా జాబితా ప్రకటన ఆలస్యమవుతూ వచ్చింది. రెండో జాబితాలో కొందరిని మార్చటంతో పాటు.. రెండు, మూడు మినహా మిగతా స్థానాలన్నింటికి ఈరోజు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. రెండో జాబితా ప్రకటన అనంతరం, తాజా రాజకీయ పరిణామాలు, అభ్యర్థుల సామర్థాల అంచనాకు జరిపిన సర్వేల్లో 9మందిపై ఆశించిన స్థాయిలో సానుకూలత లేదని గుర్తించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులకు నచ్చజెప్పిన తర్వాత.. ఆ సంఖ్య తగ్గుతూ వచ్చినట్లు సమాచారం. మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రకటనతో ఇక్కడ టికెట్‌ ఆశించిన.. చలమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరారు. ఎల్బీనగర్‌లో ముగ్గురు నాయకులను బుజ్జగించి.. ప్రచారకమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీతో కలిసి పనిచేసేట్లుగా చేయడంలో పార్టీ నాయకత్వం సఫలమైంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగిస్తూ వస్తున్నారు. మరి ఈరోజు వచ్చే మూడో జాబితా తర్వాత ఇంకా ఎలాంటి అసమ్మతి సెగలు మొదలవుతాయో చూడాలి.

Read Also : Nara Lokesh : బస్ స్టేషన్ లో ప్రమాదానికి ప్రభుత్వ‌మే బాధ్య‌త వ‌హించాలి – నారా లోకేష్‌