Congress MP Candidates : 14 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?

Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ  14  సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 07:59 AM IST

Congress MP Candidates : తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకుగానూ  14  సీట్లకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. గెలుపు గుర్రాలనే ఈ 14 సీట్లకు ఎంపిక చేశారని తెలుస్తోంది. కేవలం హైదరాబాద్, మల్కాజిగిరి, ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని సమాచారం. ఇటీవల సమావేశమైన కాంగ్రెస్ పార్టీ  స్క్రీనింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 14 మంది అభ్యర్థుల ఎంపికపై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. బరిలోకి దిగనున్న అభ్యర్థులపై ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇప్పటికే సర్వేలు  కూడా మొదలుపెట్టారట.  ఈ సర్వేలలో వచ్చే ఫలితాల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకోనుందట. ఇక ఏయే నియోజకవర్గాలకు ఎవరెవరి పేర్లను పరిశీలిస్తున్నారనే వివరాలను ఓసారి చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

  • సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కాంగ్రెస్ పార్టీ  స్క్రీనింగ్ కమిటీ ఎదుట  ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
  • నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
  • పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకృష్ణ పేరు పరిశీలిస్తున్నారు.
  • కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచల రాజేందర్‌రావుల పేర్లను ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
  • జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ పేరుతో పాటు ఉజ్వల రెడ్డి, సిద్ధా రెడ్డి పేర్లను ప్రతిపాదించారు.
  • మెదక్ నుంచి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరును పరిశీలిస్తున్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఫయీమ్ ఖురేషి పేరు కూడా చర్చలో ఉందట.
  • చేవెళ్ల నుంచి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పట్నం సునీత మహేందర్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నారట.
  • మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి పేర్లను ప్రతిపాదించారు.
  • నల్గొండ నుంచి మాజీ మంత్రి కుమారుడు రఘువీర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
  • వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు ఓ మహిళా నాయకురాలి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
  • ఖమ్మం నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పేరు ప్రతిపాదనకు వచ్చినట్లు తెలుస్తోంది.
  • భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
  • కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ మల్కాజిగిరి, వరంగల్, నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది.

Also Read : Prashant Kishor : ఏపీలో టీడీపీ గెలుపు ఖాయం..?