Site icon HashtagU Telugu

Telangana Congress : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏమన్నారంటే?

Telangana Congress Senior leaders reactions on Karnataka Results

Telangana Congress Senior leaders reactions on Karnataka Results

ముందు నుంచి అందరూ చెప్తున్నట్టు కర్ణాటక(Karnataka)లో కాంగ్రెస్(Congress) గెలుపు దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే అనేక సీట్లను గెలవగా, మ్యాజిక్ ఫిగర్ దాటి మరీ సీట్లలో లీడ్ లో ఉంది కాంగ్రెస్. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ ఇంతటి భారీ విజయాన్ని చూస్తుంది. కాంగ్రెస్ అగ్ర నాయకుల నుంచి కార్యకర్తల వరకు అంతా సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక ఈ కర్ణాటక ఫలితాలపై కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పలువురు తెలంగాణ(Telangana) సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా మీడియాతో మాట్లాడారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది. కర్ణాటక బీజేపీకి చెంపపెట్టు రిజల్ట్ ఇచ్చింది. కర్ణాటక లాగే తెలంగాణలో కూడా అసమర్థత, అవినీతి నడుస్తుంది. వచ్చే ఎలక్షన్స్ లో అది పోతుంది అని అన్నారు.

ఇక మరో సీనియర్ నాయకులు V హనుమంతరావు మాట్లాడుతూ.. మా నేతల మధ్య ఉన్న మనస్పర్థలు పక్కన పెట్టాలి. ఏమన్నా ఉంటె మాణిక్ ఠాక్రేతో మాట్లాడుకొని సర్దుకోవాలి. మన లీడర్స్ మధ్య కూడా గ్యాప్ లేకపోతే తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ని నమ్ముతున్నారు. 2024లో రాహుల్ దేశ ప్రధాని అవుతారు అని అన్నారు

పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. 2024లో 1980 చరిత్ర రిపీట్ అవుతుంది. ప్రజలకు కాంగ్రెస్ ఏం చేసింది, ఏం చేయబోతోంది చెబుదాం అని తెలిపారు.

ఇక జానారెడ్డి మాట్లాడుతూ.. నియంతృత్వానికి, అహంకారానికి కర్ణాటక ప్రజలు తీర్పు ఇచ్చారు. కర్ణాటక నేతల మధ్య గ్యాప్ ఉన్నా ఎలక్షన్స్ లో అందరూ కలిసి కట్టుగా పని చేశారు. ఇలానే తెలంగాణలో కూడా పని చేయాలి. కర్ణాటక మాదిరి తెలంగాణలో పంథాని కొనసాగించాలి. అన్ని వర్గాల వాళ్ళు మతతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ ని కూడా ఓడించాలి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కి పట్టం కట్టాలి. మేము అందరం కలిసి కట్టుగా పని చేస్తాం అని అన్నారు. మరి కర్ణాటక ఫలితాలు తెలంగాణాలో ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి.

 

Telangana: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు: కేటీఆర్