Site icon HashtagU Telugu

Telangana Congress: పొంగులేటి, జూపల్లి చేరికపై కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి

Telangana Congress

New Web Story Copy 2023 06 21t180819.762

Telangana Congress: కాంగ్రెస్ లో పొంగులేటి, జూపల్లి చేరిక ఖాయమైంది. ఇప్పటికే అధినేత రేవంత్ రెడ్డితో సంప్రదింపుల అనంతరం పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లోకి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆ నేతలు కాంగ్రెస్ లోకి రావడం పార్టీ సీనియర్లకు నచ్చడం లేదట. దీంతో సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి.

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేరికల పర్వం కొనసాగుతుంది. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేతలను టార్గెట్ చేస్తున్నారు రేవంత్. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్తి నేతలకు గాలం వేస్తున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరబోతున్నారు. అయితే ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లోకి రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మాజీ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

పొంగులేటి, జూపల్లిని ఎవరిని అడిగి చేర్చుకుంటున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరోవైపు కోమటిరెడ్డికి కూడా నచ్చట్లేదట. ఈ నేపథ్యంలో ఆ నేతలిద్దరూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరిని అడిగి ఈ నిర్ణయం తీసుకున్నారని ఉత్తమ్, కోమటిరెడ్డి నిలదీస్తున్నారు. సునీల్ కనుగోలు చెప్తే వారిని చేర్చుకోవడమేనా.. మాకు కనీసం సమాచారం ఇవ్వరా అంటూ మండి పడుతున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి.

Read More: KCR and Modi relation : విప‌క్షాల మీటింగ్ కు `నో ఇన్విటేష‌న్‌`, BJP బీ టీమ్ గా BRS కు ముద్ర‌!