Telangana : కోమ‌టిరెడ్డి చెప్పిన పొత్తుకు ప్లీన‌రీ గ్రీన్ సిగ్న‌ల్ ! BRS,కాంగ్రెస్ కూట‌మి?

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు(Alliance) మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది.

  • Written By:
  • Updated On - February 25, 2023 / 03:49 PM IST

తెలంగాణ (Telangana)రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు(Alliance) అంశం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. చ‌త్తీస్ గ‌డ్ కేంద్రంగా జ‌రిగిన కాంగ్రెస్ ప్లీన‌రీ పొత్తుల‌కు పిలుపునిచ్చింది. ఆ క్ర‌మంలో ప‌దేప‌దే వినిపిస్తోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ఇటీవ‌ల భావ‌సారూప్య‌త ఉన్న లౌకిక పార్టీలుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల‌ను ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి పోల్చారు. స‌రిగ్గా ఇదే పోలిక‌ను వినిపిస్తూ ఏఐసీపీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే పొత్తుల‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు, త్యాగాల‌కు కూడా కాంగ్రెస్ సిద్ద‌మ‌ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది నుంచి బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు వ్య‌వ‌హారం సోనియా నుంచి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వ‌ర‌కు వినిపిస్తూనే ఉంది.

రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు(Telangana)

కాంగ్రెస్ పార్టీలోని సీనియ‌ర్లు కొంద‌రు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు(Alliance) సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు, అధిష్టానం వ‌ద్ద ఆ విష‌యాన్ని పంచుకున్నార‌ని త‌రచూ వినిపించే మాట‌. దానికి బ‌లం చేకూరేలా ప్ర‌శాంత్ కిషోర్ గ‌త ఏడాది ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇచ్చిన సంద‌ర్బంగా బీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తును సోనియా ఎదుట ప్ర‌స్తావించారు. తాజాగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి కూడా పొత్తుల అంశాన్ని ఢిల్లీ వేదిక‌గా వినిపించారు. ఒంట‌రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చే బ‌లం లేద‌ని తేల్చారు. స‌ర్వేల ప్ర‌కారం 40 స్థానాల వ‌ర‌కు (Telangana)కాంగ్రెస్ ప‌రిమితం అవుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ తో పొత్తు అనివార్య‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న ఇచ్చిన స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో దుమారం రేపింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు ఆ రెండు పార్టీలు ద‌గ్గ‌రవుతున్నాయ‌ని చెప్ప‌డానికి చాలా ఉన్నాయి.

కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు గురించి `షా`  

తెలంగాణలో (Telangana)కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు గురించి `షా` కోర్ క‌మిటీ స‌మావేశంలో ఆ మ‌ధ్య ప్ర‌స్తావించార‌ట‌. ఆ కూటమికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని బీజేపీ నేత‌ల‌కు ఇటీవ‌ల దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. విమోచ‌నదినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో రెండు రోజుల పాటు షా ఇటీవ‌ల ఉన్నారు. ఆ సంద‌ర్భంగా దిశానిర్దేశం చేస్తూ కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు (Alliance)అనే అంశం కీల‌కంగా ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థి మార్గరెట్‌ అల్వాకు టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చింది. ఆ విషయాన్ని బీజేపీ తెలంగాణ‌ నేతలకు షా గుర్తు చేశార‌ట‌. ఆయ‌న చెప్పిన దాట్లో వాస్త‌వం లేక‌పోలేదు. జాతీయ ప్రత్యామ్నాయం దిశ‌గా వెళుతోన్న కేసీఆర్ ప‌రోక్షంగా కాంగ్రెస్ పార్టీకి స‌హ‌కారం అందిస్తున్నారు. ఇటీవ‌ల ఈడీ విచార‌ణ సంద‌ర్భంగా సోనియా, రాహుల్ కు మ‌ద్ధ‌తు ప‌లికారు. ఆ మ‌ధ్య రాహుల్ పుట్టుక గురించి బీజేపీ నేత‌లు ప్ర‌స్తావించిన‌ప్పుడు సీరియ‌స్ స్పందించిన‌ కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డారు.

Also Read : Komatireddy Venkat Reddy: కోమటిరెడ్డి కొత్త డిమాండ్.. అనుచర వర్గానికి పీసీసీ పోస్టులు?

పొత్తుకు (Alliance)క‌లిసి రావాల‌ని ఇటీవ‌ల కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ దిగ్విజ‌య్ సింగ్ టీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ `మాతో క‌లిసి రావొచ్చు కాదా` అంటూ ఒక ప్రైవేట్ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ చేసిన కామెంట్ పొత్తు సంకేతాన్ని లేపింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ పొత్తు అంశం చాలా కాలంగా పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో న‌డుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావ‌డానికి ముందే ఆ రెండు పార్టీ మ‌ధ్య పొత్తు చ‌ర్చ‌లు న‌డిచాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాన‌ని అప్ప‌ట్లో కేసీఆర్ అన్నారు. ఆ త‌రువాత కాంగ్రెస్ పార్టీని కాద‌ని వెళ్లాడ‌ని చెబుతూ, `మాతో క‌లిసి రావొచ్చు` అంటూ అభిప్రాయాన్ని దిగ్విజ‌య్ సింగ్ వ్య‌క్త‌ప‌రిచారు. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే 2023 అసెంబ్లీ లేదా 2024 సాధార‌ణ ఎన్నిక‌ల నాటికి కాంగ్రెస్, బీజేపీ పొత్తు దిశ‌గా వెళ‌తాయ‌ని సంకేతాలు ఉన్నాయి. అదే విష‌యాన్ని అమిత్ షా కోర్ క‌మిటీలో మీటింగ్ లో చెప్పార‌ని తెలుస్తోంది.

 Also Read : Revanth Reddy : BRS,కాంగ్రెస్`పొత్తు`పై కోమ‌టిరెడ్డి పొడుపు! కాంగ్రెస్లో క‌ల్లోలం!!

కాంగ్రెస్ తో కూడిన విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఇటీవ‌ల భేష‌ర‌తుగా కేసీఆర్ మ‌ద్ధ‌తు ప‌లికారు. అంతేకాదు, రాహుల్ పుట్టుక మీద బీజేపీ కి చెందిన లీడ‌ర్లు చేసిన కామెంట్ల‌పై కేటీఆర్, కేటీఆర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు (Alliance)అంశాన్ని సోనియా వ‌ద్ద రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ప్ర‌స్తావించారు. ఆ రోజు నుంచి రెండు పార్టీలు ప‌రోక్షంగా ప‌లు సంద‌ర్భాల్లో క‌లిసి వెళ్ల‌డాన్ని చూస్తున్నాం.

బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య పోటీ అనేలా ఫోక‌స్

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ, టీఆర్ఎస్ మ‌ధ్య పోటీ అనేలా ఫోక‌స్ ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పొత్తు కోసం చూస్తోంది. అందుకే, ఏఐసీసీలోని సీనియ‌ర్ లీడ‌ర్ గా ఉన్న దిగ్విజ‌య్ సింగ్ `క‌లిసిపోదాం` అంటూ స‌రికొత్త స్లోగ‌న్ అందుకున్నారు. దానికి ఇప్పుడు మ‌రింత బ‌లాన్నిచ్చేలా ఖ‌ర్గే ప్లీన‌రీ వేదిక‌గా ఇచ్చిన పిలుపు ఉంది.

Also Read : Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 100 రాములోరి ఆలయాలు!

సాధార‌ణంగా జాతీయ పార్టీలు ప్ర‌ధాని పీఠం గురించి ఎక్కువ‌గా ఫోక‌స్ చేస్తాయి. ఆ కోణంలో కొన్ని రాష్ట్రాల్లో పార్టీని సైతం ప‌ణంగా పెట్టిన సంద‌ర్భాలు బోలోడు. ఆ కోణం నుంచి ఒక వేళ కేసీఆర్ యూపీఏకు అండ‌గా ఉంటానంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ పొత్తు ఖాయంగా ఉంటుంద‌ని భావించొచ్చు. ఆ విష‌యాన్ని త్యాగం రూపంలో ఏఐసీసీ చీఫ్ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే చాలా సున్నితంగా చెప్పేశారు. అంటే, కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి చెప్పిన పొత్తు(Alliance) వ్య‌వ‌హారంకు ఇప్పుడు కాంగ్రెస్ ప్లీన‌రీ వేదిక‌గా దాదాపు స్ప‌ష్ట‌త వ‌చ్చిన‌ట్టే.!