Site icon HashtagU Telugu

Congress Next CM Candidate : నెక్స్ట్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డేనా..?

Kvr

Kvr

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో మరోసారి సీఎం అభ్యర్థి (CM Candidate) చర్చ మొదలైంది..గత ఎన్నికల ముందు..ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సీఎం అభ్యర్థిగా నేనంటే నేనంటూ చాలామంది పోటీపడిన సంగతి తెలిసిందే. చివరికి అధిష్టానం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ని సీఎం గా, భట్టి ని ఉప ముఖ్యమంత్రిగా తేల్చారు. అయినప్పటికీ చాలామందిలో మీము కాలేదే అనే బాధ లోలోపల ఇప్పటికి ఉంది కానీ బయటకు మాత్రం చెప్పలేకపోతున్నారు. తాజాగా నిన్న సీఎం అయ్యే అర్హత తనతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy)కి ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన మాత్రమే కాదు ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఇలాంటి కామెంట్సే చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వెంకట్ రెడ్డికి బంగారు భవిష్యత్ ఉందని ఈ రోజు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

సడెన్ గా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు చెప్పడం అంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమందైతే నెక్స్ట్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డినే అంటూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ లోని కీలక నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేరు చెప్పేసరికి నెక్స్ట్ భట్టి కి , ఉత్తమ్ కు సీఎం అయ్యే ఛాన్స్ లేదా అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. నిజంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనే ఫిక్స్ అయ్యారా..? లేక ఇంకేమైనా ఉందా..? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికి లోక్ సభ పోలింగ్ సమీపిస్తున్న తరుణంలో సీఎం అభ్యర్థి అనే చర్చ రావడం హాట్ టాపిక్ గా మారింది.

Read Also : PM Modis Speech : కీలక పరిణామం.. ప్రధాని ప్రసంగంపై ఫిర్యాదుల పరిశీలన మొదలుపెట్టిన ఈసీ