Site icon HashtagU Telugu

Telangana: 10 రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో.. ఉద్యోగాల కల్పనపై దృష్టి

Telangana (46)

Telangana (46)

Telangana: తెలంగాణ ప్రజల నాడిని కాంగ్రెస్ బాగానే గుర్తిస్తోందనిపిస్తోంది. ఇప్పటికే ఆరు హామీ పథకాల వాగ్దానాలతో ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. కానీ.. యువతకు నిరాశే మిగిలింది. ఆరు పథకాల్లో తమకు ఉద్యోగాలు లేక నిరుద్యోగ భృతి ఏమీ లేదని వాపోయారు. దీన్ని పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ తన తప్పును సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరున ప్రకటించే మేనిఫెస్టోలో.. మెగా డీఎస్సీతో పాటు.. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంపై కీలక హామీలు ఉండబోతున్న సంగతి తెలిసిందే.

తెలంగాణలో ప్రభుత్వ ఖాళీల భర్తీ సక్రమంగా జరగలేదని కొందరు నిరుద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పోటీ పరీక్షల రద్దు వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. చాలా మంది రుణాలు తీసుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. పరీక్షల రద్దు, వాయిదా వంటి అంశాలు వారికి ఆర్థిక సమస్యగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి షాకిస్తారనే ఉద్దేశంతో అలాంటి వాళ్లంతా కాంగ్రెస్‌కు లేదా బీజేపీకి ఓటేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే వారి ఓట్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో ఉద్యోగాల భర్తీపై కీలక హామీలు గుప్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల నుంచే కసరత్తు చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణలో మెగా డీఎస్సీ కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు.. మెగా డీఎస్సీ రాయాలనుకునే ముందు.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. ఇప్పుడు ఆ పరీక్షలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి రాగానే వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి పెద్దఎత్తున ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్.. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చిన సంగతి తెలిసిందే.

తెలంగాణకు చెందిన పలువురు నిరుద్యోగులు ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. కానీ.. ఈ క్రమంలో వారు చేస్తున్న కొన్ని పొరపాట్లు వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కొందరిని మోసం చేస్తుంటే మరికొందరు విదేశాల్లో జైలుకెళ్లుతున్నారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. అందుకే తాము అధికారంలోకి రాగానే గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది. తద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. ఈ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చబోతున్నట్లు తెలుస్తోంది.

ఈసారి తెలంగాణ యువత తమ గురించి ఆలోచించే పార్టీకే ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చే పార్టీకి ఓటు వేసి తమ సత్తా చాటేందుకు యువత సిద్ధమైనట్లు సమాచారం. అందుకే ఇప్పుడు యువతను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: Alllu Arjun : సెలబ్రేషన్స్ విషయంలో తగ్గేదెలా అంటున్న పుష్ప రాజ్