T-Congress: రేవంత్ రెడ్డి దెబ్బ‌, బీజేపీ గూటికి మ‌ర్రి?

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్ప‌డానికి సిద్దం అయ్యారు. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మీద రెండు నెల‌ల క్రితం ధ్వ‌జ‌మెత్తిన ఆయ‌న పార్టీని వీడబోతున్నారు. బీజేపీ గూటికి చేర‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నార‌ని తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - November 19, 2022 / 04:53 PM IST

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం మ‌ర్రి చెన్నారెడ్డి కుమారుడు మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కి గుడ్ బై చెప్ప‌డానికి సిద్దం అయ్యారు. పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మీద రెండు నెల‌ల క్రితం ధ్వ‌జ‌మెత్తిన ఆయ‌న పార్టీని వీడబోతున్నారు. బీజేపీ గూటికి చేర‌డానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నార‌ని తెలుస్తోంది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయ‌న భేటీ అయ్యారు. భ‌విష్య‌త్ కోసం కొన్ని హామీల‌ను షా నుంచి పొందార‌ని తెలుస్తోంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో మ‌కాం వేసిన ఈటెల‌, డీకే, బండి స‌మ‌క్షంలో ఈ మొత్తం ఆప‌రేష‌న్ పూర్త‌యిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. ఇటీవ‌ల తెలంగాణ‌లో జ‌రిగిన భార‌త్ జోడో యాత్ర‌కు కూడా దూరంగా ఉన్న మ‌ర్రి ఇక కాంగ్రెస్ పార్టీని వీడ‌డం త‌రువాయి అంటూ బ‌ల‌మైన ప్ర‌చారం ఉంది. పార్టీని వీడే ముందుగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారాన్ని క‌డిగేసి వెళ్లాల‌ని సంసిద్ధ‌మైన‌ట్టు ఆయ‌న వ‌ర్గీయుల నుంచి అందుతోన్న స‌మాచారం. కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం మ‌ర్రి వాల‌కాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

Also Read:  TRS Group Politics: టీఆర్ఎస్ ‘వర్గపోరు’పై కేసీఆర్ ఫైట్!

పార్టీ సిద్దాంతం ప్ర‌కారం ఏడు పదులు దాటితే బీజేపీలో ఎలాంటి పదవులు ఉండవు. అయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో, అక్కసుతో పార్టీని వీడాలని మర్రి శశిధర్ రెడ్డి ప్రయత్నించడం కొంత విమర్శలకు దారి తీసింది. బీజేపీలో చేరితే ఆయనకు గవర్నర్ పదవి దక్కుతుందన్న హామీతోనే చేరుతున్నట్లు చెబుతున్నారు. ప్ర‌స్తుతం 67 సంవత్సరాల వయసు దాటిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి పార్టీ మారుతున్నారు.

ఆయ‌న తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 1992లో అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో ఆయన చివరి సారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన గెలుపు అందుకోలేక పోయారు. అయిన‌ప్ప‌టికీ కేంద్రంలో కేబినెట్ పదవిని కాంగ్రెస్ కేటాయించింది. జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఛైర్మన్ గా నియమించింది. దాదాపు పదేళ్ల పాటు ఆ పదవిలో శశిధర్ రెడ్డి కొనసాగారు. అనంతరం 2014లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ లో కీలక భూమికనే పోషిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి తనయుడిగా ప్రత్యేక గౌరవం పొందుతున్నారు.

Also Read:  Revanth Reddy: ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్.. ప్రత్యేక కార్యాచరణలో రేవంత్!

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి మర్రి శశిధర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల ఆయన పీసీసీ పై బహిరంగ విమర్శలే చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా మర్రి శశిధర్ రెడ్డి దూరంగానే ఉన్నారు. మొత్తం మీద ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో రేవంత్ రెడ్డితో ఇమ‌డ‌లేక పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యారు. త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి చేర‌డానికి సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.