Site icon HashtagU Telugu

2023 Telangana Elections : 6 గ్యారెంటీ పథకాలతో 6 సిక్స్ లే అంటున్న కాంగ్రెస్

Congress 6

Congress 6

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ (Congress) జోష్ రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. గత మూడు నెలల్లో కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పధకాలు ( Congress Guarantee Schemes) ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాలతోనే ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ప్రతి గల్లీ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది.

* మహాలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం – రూ.500 లకే గ్యాస్ సిలిండర్, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

* ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని వారికి ఇంటి స్థలం, నిర్మాణానికి రూ.5 లక్షల సాయం. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం

* చేయూత పథకం ద్వారా నెలకు రూ.4 వేల పింఛన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షల వరకు పెంపు
* గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్

* రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు

* యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తాజాగా హైదరాబాద్ సభ వేదికగా రాహుల్ & సోనియా ప్రకటించారు.

ఈ పధకాలు ప్రజలనే కాదు రాజకీయ నేతలను సైతం ఆకర్షిస్తున్నాయి. అందుకే అధికార పార్టీ బిఆర్ఎస్ ను కాదని వరుసగా కీలక నేతలు కాంగ్రెస్ గూటికి వస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది చేరగా..రాబోయే రోజుల్లో మరింత మంది చేరబోతున్నట్లు చెపుతున్నారు. ఇలా వరుస నేతలు కాంగ్రెస్ లోకి రావడం..ప్రజల్లోనూ కాంగ్రెస్ ఫై నమ్మకం రోజు రోజుకు పెరుగుతుండడం తో కాంగ్రెస్ శ్రేణుల సంతోషం మాములుగా లేదు.

ఇదే క్రమంలో వారి సంతోషాన్ని క్రికెట్ బంతులతో పోల్చారు. 2007 సెప్టెంబర్ 19 న ఇంగ్లాండ్ (England ) తో జరిగిన టీ 20 ప్రపంచకప్ (2007 T20 World Cup) లో భారతీయ ఆల్ రౌండర్ యూవరాజ్ సింగ్ ఒకే ఓవర్లో వరుసగా ఆరుసిక్సర్లు స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో కొట్టాడు. ఇప్పుడు ఆ వీడియో ను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ (X) లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. సిక్సర్లతో మోత మోగించనున్న తెలంగాణ కాంగ్రెస్ అంటూ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను.. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ లక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత లను యావరేజ్ 6 సిక్సర్లతో పోలుస్తూ…ఇంగ్లాండ్ ను కేసీఆర్ (KCR) తో పోలుస్తూ వీడియో పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒక్కో బంతి ఒక్కో సిక్స్ పడుతుంటే..ఆ పధకం వచ్చేలా చేసారు. ఈ వీడియో కాంగ్రెస్ శ్రేణులను , నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.