Site icon HashtagU Telugu

MP Elections: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో లోక్‌సభపై కాంగ్రెస్‌ గురి.. ఆశావహులు వీరే..!

Congress Rajya Sabha Candidates

Congress Emls

MP Elections: తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో విజయంతో అధికార పగ్గాలు చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సమరం (MP Elections)పై దృష్టిపెట్టింది. పలువురు నేతలు ఎంపీగా తమ అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో విజయంతో ఆశావహుల మధ్య పోటీ పెరిగింది. ఆదిలాబాద్, హైదరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ స్థానాలకు బలమైన నాయకత్వ లేమి కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంతో లోక్ సభ స్థానాల్లో పోటీ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి లోక్ సభ నుంచి వివేక్ కుమారుడు పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

కరీంనగర్ నుంచి బల్మూరి వెంకట్, ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నట్లు సమాచారం. నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి పోటీకి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, మెదక్ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మల్కాజ్ గిరి నుంచి హర్షవర్ధన్ రెడ్డిలు పోటీకి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్, చేవెళ్ల నుంచి ఎన్ఆర్ఐ రాహుల్, రఘువీర్ రెడ్డి పోటీ కోసం పార్టీ ముందు తమ అభ్యర్థిత్వాన్ని ఉంచాలని నిర్ణయించుకున్నారు.

Also Read: EX Minister Mallareddy : బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై ఎస్సీ , ఎస్టీ కేసు నమోదు

మహబూబ్ నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి వంశీ చంద్ రెడ్డి, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి, జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డి భువనగిరి నుంచి చామల కిరణ్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉంది. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య లేదా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ లేదా నెహ్రు నాయక్ పోటీలో ఉండే అవకాశం ఉంది. ఖమ్మం నుంచి వి. హనుమంతు రావు లేదా కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి తమకు టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.