Site icon HashtagU Telugu

T Congress : మోడీ రాక సందర్బంగా తోలుబొమ్మలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..

Telangana Congress Comes Up

Telangana Congress Comes Up

కాంగ్రెస్ (Congress) ఏ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. ముఖ్యముగా ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే ఎలాంటి హామీలు ఇస్తుందో తెలియజేస్తూనే..ప్రత్యర్థి పార్టీల ఫై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తుంది. తాజాగా హైదరాబాద్ కు మోడీ రాక నేపథ్యంలో నగరంలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన వినూత్న ప్రచారం అందర్నీ కట్టిపడేస్తుంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజుల క్రితం బీసీ సభ (BC Sabha) నిర్వహించి సక్సెస్ చేసిన బిజెపి నేతలు..ఈరోజు బీజేపీ మాదిగ విశ్వరూప సభ (Madiga Vishwarupa Sabha) పేరుతో మరో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కూడా ప్రధాని మోడీ (Modi) హాజరు అవుతున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో సాయంత్రం సభ ప్రారంభంకానుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మోడీ రాక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బేగంపేట మరియు హైటెక్ సిటీలలో తోలుబొమ్మలతో కూడిన హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది. ‘ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియంలో దాగుడు మూతలు ఆడుతున్న ముగ్గురు మిత్రులు’ అంటూ తెలిపి వినూత్నం గా ఏర్పాటు చేసింది. మోడీ ఇటు కేసీఆర్ ను ,అటు AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ ని పట్టుకొని ఆడిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. కేవలం ఇదే కాదు సోషల్ మీడియా లోను కాంగ్రెస్ దూకుడు చూపిస్తుంది. వినూత్న ఐడియా లతో ప్రజలను ఆకట్టుకుంటుంది.

Read Also: Hyderabad: నగరంలో భారీ అగ్ని ప్రమాదం: అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు