Telangana Congress Candidates First List : తెలంగాణ కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ సభ్యులు వీరేనా..?

నేడు ఢిల్లీ లో కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లు పాల్గొన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు అయినా అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను కమిటీ పరిశీలించింది

Published By: HashtagU Telugu Desk
T Congress First List

T Congress First List

తెలంగాణ లో ఎన్నికల (2023 Telangana Elections) సమయం దగ్గరపడుతోంది. అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ (Telangana Election Notification 2023) విడుదల చేయాలనీ ఎన్నికల సంఘం చూస్తుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డాయి. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టింది. ఇక కాంగ్రెస్ , బిజెపి పార్టీలు ఎన్నికల్లో నిల్చువాలని చూస్తున్న అభ్యర్థుల తాలూకా దరఖాస్తులను స్వీకరించే పనిలో ఉంది.

Read Also : Crazy Combination: టాలీవుడ్ లో డైనమిక్ జోడీ.. రవితేజతో రొమాన్స్ చేయనున్న రష్మిక!

తాజాగా నేడు ఢిల్లీ లో కాంగ్రెస్‌ స్క్రీనింగ్ కమిటీ (Telangana Congress Screening Committee) భేటీ జరిగింది. ఈ భేటీలో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి లు పాల్గొన్నారు. ఇప్పటివరకు దరఖాస్తు అయినా అభ్యర్థుల తాలూకా లిస్ట్ ను కమిటీ పరిశీలించింది. ఇందులో 35 నియోజకవర్గాలకు కేవలం ఒక్కొక్కరే దరఖాస్తు చేయడంతో వారినే ఫైనల్ చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులనే ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిటీకి ఫైనల్‌ చేసిన లిస్టును పంపి…ఈ నెలాఖరులోగా ఫస్ట్ లిస్ట్ విడుదల చేయాలనీ పార్టీ చూస్తుంది.

మరి ఫస్ట్ లిస్ట్ ఉండబోయే సభ్యులు (Telangana Congress Candidates First List) వీరే అని తెలుస్తుంది.

1. ములుగు – సీతక్క
2. భద్రాచలం – పొడెం వీరయ్య
3. సంగారెడ్డి – జగ్గారెడ్డి
4. నల్గొండ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి
5. కామారెడ్డి – షబ్బీర్ అలీ
6. పాలేరు – తుమ్మల నాగేశ్వరరావు
7. కొత్తగూడెం – పొంగులేటి శ్రీనివాసరెడ్డి
8. కొడంగల్ – రేవంత్ రెడ్డి
9. హుజూర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
10.కోదాడ – పద్మావతి
11 మధిర – భట్టి విక్రమార్క
12. మంథని – శ్రీధర్ బాబు
13 . జగిత్యాల – జీవన్ రెడ్డి
14. అలంపూర్ – సంపత్ కుమార్
15. నాగార్జునసాగర్ కుందూరు జైవీర్ రెడ్డి
16. పరిగి – రామ్మోహన్ రెడ్డి
17. వికారాబాద్ – గడ్డం ప్రసాద్ కుమార్
18. మహేశ్వరం – చిగురింత పారిజాత
19. ఆలేరు – బీర్ల ఐలయ్య
20. ఖైరతాబాద్ – రోహిన్ రెడ్డి
21. దేవరకొండ – వడ్త్య రమేష్ నాయక్
22. నాంపల్లి – ఫిరోజ్ ఖాన్
23. కోరుట్ల. జువ్వాడి నర్సింగ్ రావు
24.అచ్చంపేట – వంశీకృష్ణ
25 జహీరాబాద్ – ఏ. చంద్రశేఖర్
26. వరంగల్ ఈస్ట్ – కొండా సురేఖ
27. భూపాల పల్లి – గండ్ర సత్యనారాయణ
28. వేముల వాడ – ఆది శ్రీనివాస్
29. ధర్మపురి – లక్ష్మణ్
30. జడ్చర్ల – అనిరుద్ రెడ్డి
31. హుజూరాబాద్ – బల్మూర్ వెంకట్
32. ఆందోల్ – దామోదర రాజనర్సింహ
33.మంచిర్యాల – ప్రేమ్ సాగర్ రావు
34. కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు
35. ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి

  Last Updated: 20 Sep 2023, 03:54 PM IST