Site icon HashtagU Telugu

T Congress : ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్.. ప్రధాన అంశాలివే..

Revanth Reddy

Telangana Congress announced SC ST Declaration in Chevella Praja Garjana Sabha

చేవెళ్ల కేవీఆర్ మైదానంలో జరుగుతున్న కాంగ్రెస్(Congress) ప్రజా గర్జన సభలో రేవంత్(Revanth Reddy) మాట్లాడారు. తొలుత సభ ప్రధాన వేదికపై ఏర్పాటు చేసిన గద్దర్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ నేత మల్లిఖార్జున ఖర్గే(Mallikharjuna Kharge) హాజరయ్యారు. సీఎం కేసీఆర్(CM KCR) చేతిలో తెలంగాణ(Telangana)లో ఉన్న దళితులు, గిరిజనులు మోసపోయారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే.. కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా నాడు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారని మరోసారి గుర్తుచేశారు. అలాంటి తెలంగాణలో ఉన్న దళితులు, గిరిజనులను కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారన్నారు. దళితులు, గిరిజనులను ఆదుకునేందుకే.. నేడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ప్రకటిస్తోందన్నారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో ప్రధాన అంశాలివే..

– అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షలు.

– పోడు భూములకు పట్టాలివ్వడం, ఎస్సీ, ఎస్టీలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటు.

– కాంట్రాక్ట్ పనుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం.

– ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.6 లక్షలు.

– రాష్ట్రంలో కొత్తగా 5 ఐటీడీఏల ఏర్పాటు.

– 10వ తరగతి పాసైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.10వేలు ఆర్థిక చేయూత.

– ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు.

– డిగ్రీ, పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వసతి కల్పించడం.

– ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతంకి పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు.

– సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం. ఈ పథకం కింద ప్రతి గూడెం, తండా గ్రామ పంచాయతీలకు ఏటా రూ.25 లక్షలు కేటాయింపు.

 

Also Read : Telangana BJP : నిజంగానే వీరంతా బిజెపిని వీడితే పరిస్థితి ఏంటి..?