T Congress 2nd List : తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ విడుదల..

రెండో జాబితాలో 45 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈ లిస్ట్‌లో చాలా మంది కీలక నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్‌కు తెర పడినట్లయ్యింది.

Published By: HashtagU Telugu Desk
Congress 2nd List Release

Congress 2nd List Release

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీ రెండో విడత అభ్యర్థుల లిస్ట్ (T Congress 2nd List) వచ్చేసింది. మొత్తం 45 మంది తో కూడిన అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. మొదటి విడత లో 55 మందికి టికెట్ ఖరారు చేయగా..రెండో జాబితాలో 45 మందికి ఛాన్స్ ఇచ్చారు. ఈ లిస్ట్‌లో చాలా మంది కీలక నేతల పేర్లు ఉండటంతో.. ఇప్పటి వరకు కొనసాగిన సస్పెన్స్‌కు తెర పడినట్లయ్యింది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)కి పాలేరు, తుమ్మల నాగేశ్వరరరావు (Thummala Nageswara Rao)– ఖమ్మం, మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) లకు టికెట్ ఖరారు చేసారు. అలాగే మధుయాష్కి కు ఎల్బీనగర్ , గద్దర్ కూతురు వెన్నెలకు కంటోన్మెంట్ సీటును ఖరారు చేసింది.

ఇప్పటి వరకు 100 నియోజకవర్గాలకు గాను అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇంకా 19 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వీటిలో అత్యంత కీలకమైన, కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డికి సంబంధించి అభ్యర్థిని మాత్రం ఇంకా పెండింగ్ లోనే పెట్టింది. మరి కేసీఆర్ ఫై పోటీకి ఎవర్ని దింపుతుందనేది ఆసక్తిగానే ఉంది.

పూర్తి అభ్యర్థుల లిస్ట్ :

  1. సిర్పూర్: రావి శ్రీనివాస్
  2. అసిఫాబాద్ (ఎస్టీ): అజ్మీరా శ్యామ్
  3. ఖానాపూర్ (ఎస్టీ): వెద్మర బొజ్జు
  4. ఆదిలాబాద్: కంది శ్రీనివాస్ రెడ్డి
  5. బోథ్ (ఎస్టీ): వెన్నెల అశోక్
  6. ముథోల్: బోస్లె నారాయణరావు పాటిల్
  7. ఎల్లారెడ్డి: కే మదన్ మోహన్ రావు
  8. నిజామాబాద్ రూరల్: డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి
  9. కోరుట్ల: జువ్వాది నర్సింగరావు
  10. చొప్పదండి (ఎస్సీ): మేడిపల్లి సత్యం
  11. హుజూరాబాద్: వడితెల ప్రణవ్
  12. హుస్నాబాద్: పొన్నం ప్రభాకర్
  13. సిద్దిపేట: పూజల హరికృష్ణ
  14. నర్సాపూర్: ఆవుల రాజిరెడ్డి
  15. దుబ్బాక: చెరుకు శ్రీనివాస్ రెడ్డి
  16. కూకట్‌పల్లి: బండి రమేష్
  17. ఇబ్రహీంపట్నం: మల్ రెడ్డి రంగారెడ్డి
  18. ఎల్బీనగర్: మధుయాష్కి గౌడ్
  19. మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి
  20. రాజేంద్రనగర్: కస్తూరి నరేందర్
  21. శేరిలింగంపల్లి: వీ జగదీశ్వర్ గౌడ్
  22. తాండూర్: బయ్యని మనోహర్ రెడ్డి
  23. అంబర్‌పేట్: రోహిన్ రెడ్డి
  24. ఖైరతాబాద్: పీ విజయారెడ్డి
  25. జూబ్లీహిల్స్: మహ్మద్ అజహరుద్దీన్
  26. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ): డాక్టర్ జీవీ వెన్నెల
  27. నారాయణపేట్: డా. పర్ణిక చిట్టెం రెడ్డి
  28. మహబూబ్ నగర్: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  29. జడ్చర్ల: జే అనిరుధ్ రెడ్డి
  30. దేవరకద్ర: గావినోళ్ల మధుసూధన్ రెడ్డి
  31. మక్తల్: వాకిటి శ్రీహరి
  32. వనపర్తి: డా. జిల్లెల చిన్నారెడ్డి
  33. దేరకొండ (ఎస్టీ): నేనావత్ బాలూ నాయక్
  34. మునుగోడు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
  35. భువనగిరి: కుంభం అనిల్ కుమార్ రెడ్డి
  36. జనగామ: కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
  37. పాలకుర్తి: యశశ్విని
  38. మహబూబాబాద్ (ఎస్టీ): డా. మురళీ నాయక్
  39. పరకాల: రేవూరి ప్రకాశ్ రెడ్డి
  40. వరంగల్ పశ్చిమ: నాయిని రాజేందర్ రెడ్డి
  41. వరంగల్ తూర్పు: కొండా సురేఖ
  42. వర్ధన్నపేట (ఎస్సీ): కేఆర్ నాగరాజు
  43. పినపాక (ఎస్టీ): పాయం వెంకటేశ్వర్లు
  44. ఖమ్మ: తుమ్మల నాగేశ్వరరావు
  45. పాలేరు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Congress 2nd List

  Last Updated: 27 Oct 2023, 11:36 PM IST