Revanth Comments: కేసీఆర్ కు ‘ఫ్యామిలీ’ స్ట్రోక్!

ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ల మధ్య గల దూరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాకుగా చూపుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

  • Written By:
  • Updated On - April 9, 2022 / 01:35 PM IST

ప్రగతి భవన్‌, రాజ్‌భవన్‌ల మధ్య గల దూరాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సాకుగా చూపుతూ తన కొడుకు కేటీఆర్ ను దారిలోకి తెచ్చేకునేందుకు ప్రయత్నిస్తున్నారని, సీఎం పదవికి ఇది సరైన సమయం కాదంటూ కేటీఆర్ తో పాటు తన కుటుంబాన్ని నమ్మిస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కుటుంబసభ్యులు కేసీఆర్‌పై ఒత్తిడి తెస్తున్నారని, అయితే గవర్నర్‌ కార్యాలయానికి మధ్య ఉన్న విభేదాలను ముఖ్యమంత్రి సాకుగా చూపుతున్నారని, ఇప్పటికైనా కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయండి’’ అని రేవంత్ రెడ్డి హితవు పలికారు. రాజ్‌భవన్‌లో ఉగాది ఉత్సవాలకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై  గవర్నర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్‌ నేతలు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

అంతేకాదు… ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు ఇచ్చిన ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకోవాలని రేవంత్ గవర్నర్‌ను కోరారు. ఈ ప్రత్యేకాధికారాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ అమ్మకాలు, వినియోగానికి సంబంధించి చట్టాన్ని అమలు చేసే సంస్థలకు సమీక్షలు నిర్వహించి, ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని గవర్నర్‌కు వర్తిస్తాయన్నాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో డ్రగ్స్ వాడకం పెరగడంతో నెట్‌వర్క్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ED, NCB, DRI వంటి కేంద్ర ఏజెన్సీలకు లేఖ రాయాలని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై కోరారు.

గవర్నర్‌కు బీజేపీ పట్ల ఉన్న అనుబంధాన్ని రాజకీయ అంశంగా చూపేందుకు టీఆర్‌ఎస్‌ మంత్రులు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. అయితే అధికార టీఆర్ ఎస్ పార్టీ బీజేపీకి ఓటు వేసినప్పుడు రామ్‌నాథ్‌ కోవింద్‌, వెంకయ్యనాయుడు ప్రముఖ స్థానాల్లో కొనసాగుతున్నారనే విషయం తెలియదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా వెళ్లడంపై హైదరాబాద్‌ ‘కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు’ ఎం.కోదండరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. రామారావు పెట్టుబడులకు సంబంధించిన పూర్తి వివరాలను ఎందుకు బహిరంగంగా వెల్లడించడం లేదని ప్రశ్నించారు. అమెరికా కెమికల్ కంపెనీలను ఇక్కడే తమ వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించిన కొండండ రెడ్డి, దీని వల్ల రాష్ట్రంలో కాలుష్య స్థాయిలు మరింత పెరుగుతాయన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పేదల అసైన్డ్ భూములను ఇప్పుడు బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు. అయితే మరో టీఆర్ఎస్ ముఖ్య నేత సంతోష్ రావు కూడా విదేశీ పర్యటనకు వెళ్లడం కూడా హాట్ టాపిక్ గా మారింది.